ETV Bharat / bharat

బంగాల్‌ ఘటనపై విచారణకు కేంద్రం ఆదేశం - Amit shah news updates

జేపీ నడ్డా కాన్వాయ్​పై రాళ్ల దాడి జరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలపై బంగాల్​ గవర్నర్ నుంచి కేంద్రం నివేదిక కోరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నడ్డాకు భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి హోంశాఖ కార్యదర్శి లేఖ రాసినట్లు వెల్లడించాయి.

Centre seeks report from WB governor on law and order situation asks chief security to provide security to Nadda
బంగాల్‌ ఘటనపై విచారణకు అమిత్‌ షా ఆదేశం
author img

By

Published : Dec 10, 2020, 10:35 PM IST

బంగాల్​ పర్యటనలో ఉన్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్లదాడి ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. దాడి ఘటనకు సంబంధించి రెండు నివేదికలను కోరారు. బంగాల్‌లోని శాంతిభద్రతల అంశంపై గవర్నర్‌ను ఓ నివేదిక కోరగా.. ఘటనకు సంబంధించి వివరాలు ఇవ్వాలని అధికారుల నుంచి మరో నివేదిక అడిగారు. అలాగే నడ్డాకు భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కోరారు. ఈ దాడిని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తుందని షా పేర్కొన్నారు.

"బంగాల్‌లో ఈ రోజు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై దాడి చేశారు. దాడి ఖండిస్తున్నాం. ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ హింసాత్మక దాడిపై ప్రజలకు బంగాల్​ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది" అని హిందీలో ట్వీట్​ చేశారు షా.

మరోవైపు ఈ ఘటనపై భాజపా, తృణమూల్‌ కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం మొదలైంది. తృణమూల్‌ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని భాజపా ఆరోపించింది. దాడి సమయంలో పోలీసులు ఎవరినీ అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ ఆరోపించారు.

'అంత డ్రామా'

దీనిపై బంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత్రి మమత స్పందించారు. దాడి ఘటనను భాజపా ఆడుతున్న 'డ్రామా'గా అభివర్ణించారు. తృణమూల్‌ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకే ఈ కుట్ర పన్నారని ఆరోపించారు. నడ్డా పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ పార్టీ ఎలాంటి భద్రతా కోరలేదన్నారు. ప్రజలకు భాజపా నచ్చకపోతే తామేం చేస్తామంటూ మమత మేనల్లుడు, ఆ పార్టీ ఎంపీ అభిషేక్‌ వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: జేపీ నడ్డా కాన్వాయ్​పై రాళ్ల దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.