కరోనా చికిత్సలో ఉపయోగిస్తున్న రెమ్‌డెసివిర్ ఔషధాన్ని కేంద్రం.. రాష్ట్రాల వారీగా కేటాయింపులు చేసింది. రెమ్‌డెసివిర్ ఔషధ ఉత్పత్తి సంస్థలతో సంప్రదింపుల అనంతరం కేంద్ర రసాయన, ఫెర్టిలైజర్ మంత్రిత్వశాఖ.. ఈ నెల 16 వరకు రాష్ట్రాలకు 53 లక్షల రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో మహారాష్ట్రకు 11 లక్షల 57 వేలు, ఆంధ్రప్రదేశ్‌కు 2లక్షల 35వేలు, తెలంగాణకు లక్షా45 వేల ఇంజెక్షన్లు కేటాయించింది.
రెమ్‌డెసివిర్ ఉత్పత్తి సంస్థలకు అందుకు తగిన ప్రణాళికను పంపింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ రాష్ట్రాల్లో కొరత లేకుండా ప్రణాళిక రూపొందించుకోవాలని కేంద్రం సూచించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సక్రమంగా రెమ్‌డెసివిర్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఔషధాన్ని పొందేందుకు రాష్ట్రాల నోడల్ అధికారులు ఔషధ మార్కెటింగ్ సంస్థలకు ఆర్డర్‌లు ఇవ్వాలని కోరింది. గుర్తింపు పొందిన ప్రైవేటు డిస్ట్రిబ్యూటర్ ద్వారా కూడా కొనుగోలు చేయడానికి.. అవకాశం ఇచ్చింది. రాష్ట్రాల నోడల్ అధికారులు తమ పరిధిలో ఎంత మొత్తం రెమ్‌డెసివిర్ కావాలో మార్కెటింగ్ వారికి చెప్పి సరఫరా చేయించాలని కేంద్రం పేర్కొంది.
ఇదీ చూడండి: 71 శాతం కేసులు ఆ పది రాష్ట్రాల్లోనే: కేంద్రం