భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ అంజలి ఘటించారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్న మోదీ.. విస్తృత రాజ్యాంగం అందించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు.
అంబేడ్కర్ పోరాటం లక్షలాది మందిలో స్ఫూర్తిని రగిలించిందని ప్రధాని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత సోనియాగాంధీ కూడా అంబేడ్కర్‌కు నివాళులు అర్పించారు.
ఇవీ చదవండి:
చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడిన ముఖ్యమంత్రి వీడియో వైరల్
అభివృద్ధి పథంలో కశ్మీరం.. మూడంచెల వ్యూహంతో కేంద్రం ప్రగతి బాట..