కార్గిల్ దివాస్‌ను పురస్కరించుకుని అమరవీరులకు నివాళులు అర్పించారు త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ సహా సైనిక సిబ్బంది. ఈ క్రమంలో లద్దాఖ్, ద్రాస్ ప్రాంతం పోలో మైదానంలోని అమరుల స్మారకం వద్ద 559 దీపాలు వెలిగించారు.
సోమవారం జరగనున్న కార్గిల్ దివాస్ వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొననున్నారు. జమ్ముకశ్మీర్‌లో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఇప్పటికే శ్రీనగర్ చేరుకున్న కోవింద్.. లద్దాఖ్‌లోని ద్రాస్ ప్రాంతానికి చేరుకోనున్నారు.
1999 దురాక్రమణలకు పాల్పడ్డ దాయాది పాక్‌ను.. రణక్షేత్రంలో మట్టికరిపించి తిరిగి మన భూభాగాల్ని సొంతం చేసుకున్న ఘనత భారత్ ఉంది. నాడు కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం తెగువకు.. చావు తప్పి కన్ను లొట్టబోయిన పాక్ తోకముడిచింది. అక్రమంగా తిష్టవేసిన ప్రాంతాలను తిరిగి అప్పగించింది