ETV Bharat / bharat

బిపిన్​ రావత్​ నిజమైన దేశభక్తుడు : మోదీ

Bipin Rawat passed away: భారత త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ అకాల మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

CDS Bipin Rawat succumbs
సీడీఎస్​ బిపిన్​ రావత్​కు మోదీ సహా ప్రముఖుల నివాళి
author img

By

Published : Dec 8, 2021, 7:12 PM IST

Updated : Dec 8, 2021, 8:08 PM IST

Bipin Rawat passed away: తమిళనాడు హెలికాప్టర్​ ప్రమాదంలో భారత త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ మృతిపై విచారం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జనరల్​ బిపిన్​ రావత్​, ఆయన భార్య, ఆర్మీ అధికారుల మరణాలపై సంతాపం ప్రకటించారు. అత్యంత శ్రద్ధతో వారంతా దేశ సేవ చేశారని కొనియాడారు.

  • Gen Bipin Rawat was an outstanding soldier. A true patriot, he greatly contributed to modernising our armed forces and security apparatus. His insights and perspectives on strategic matters were exceptional. His passing away has saddened me deeply. Om Shanti. pic.twitter.com/YOuQvFT7Et

    — Narendra Modi (@narendramodi) December 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

''జనరల్ బిపిన్ రావత్ అద్భుత సైనికుడు. నిజమైన దేశభక్తుడు. ఆయన మన సాయుధ బలగాలను, భద్రతా యంత్రాంగ ఆధునీకీకరణలో దోహదపడ్డారు. వ్యూహాత్మక విషయాలపై ఆయన ఆలోచనలు అసాధారణం. ఆయన మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. ఓం శాంతి.''

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.

దేశం గొప్ప వీరుడిని కోల్పోయింది: రాష్ట్రపతి

సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్, ఆయన భార్య మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. దేశం గొప్ప వీరుడిని కోల్పోయిందని పేర్కొన్నారు. ' దేశంలో తన ధీర కుమారుల్లో ఒకరిని కోల్పోయింది. మాతృభూమి కోసం ఆయన నాలుగ దశాబ్దాల నిస్వార్థ సేవ అసాధారణమైన శౌర్యం, వీరత్వమే తెలుపుతున్నాయి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. హెలికాప్టర్​ ప్రమాదంపై చాలా బాధాకరం. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి నివాళులు. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి. ' అని ట్వీట్​ చేశారు.

  • I am shocked and anguished over the untimely demise of Gen. Bipin Rawat and his wife, Madhulika ji. The nation has lost one of its bravest sons. His four decades of selfless service to the motherland was marked by exceptional gallantry and heroism. My condolences to his family.

    — President of India (@rashtrapatibhvn) December 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వెంకయ్య దిగ్భ్రాంతి

చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్​ స్టాఫ్​ జనరల్​ బిపిన్​ రావత్​ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ' తమిళనాడు, కూనూర్​లో హెలికాప్టర్​ ప్రమాదానికి గురై.. సీడీఎస్​ బిపిన్​ రావత్​, ఆయన భార్య శ్రీమతి మధులిక రావత్​, ఆర్మీ అధికారుల మృతి ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​తో మాట్లాడి సంతాపం తెలిపా. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.' అని ట్విట్టర్​లో పేర్కొన్నారు.

బాధాకరమైన రోజు: అమిత్​ షా

సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్​ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. ఇదో బాధాకరణైన రోజుగా అభివర్ణించారు. రావత్​ సహా ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ అధికారుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. హెలికాప్టర్​ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన చికిత్స పొందుతున్న.. గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు షా.

రాజ్​నాథ్​ నివాళి

త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ దంపతులు సహా మరో 11 మంది దుర్మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. బిపిన్​ మరణం.. దేశ సాయుధ దళాలకు తీరని లోటు అని పేర్కొన్నారు.

ఆర్మీ సంతాపం..

హెలికాప్టర్​ ప్రమాదంలో జనరల్​ బిపిన్​ రావత్​, ఆయన భార్య సహా మరో 11 మంది ఆర్మీ అధికారుల మృతిపై ప్రగాఢ సానుభూతి ప్రకటించింది భారత సైన్యం, సైనికాధిపతి ఎంఎం నరవాణె. 'భారత తొలి సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్​ దూరదృష్టిగల గొప్ప వ్యక్తి. భారత ఆర్మీలోని ఉన్నతస్థాయి సంస్థల్లో సంస్కరణలకు పునాదివేశారు. భారత ఉమ్మడి థియేటర్​ కమాండ్​ల పునాదిని రూపొందించటంలో కీలక పాత్ర పోషించారు. ఆయుధాలు, సామగ్రి తయారీలో స్వదేశీ శక్తిని పెంచారు. ' అని పేర్కొంది.

రాహుల్​ గాంధీ నివాళి..

జనరల్​ బిపిన్​ రావత్​ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. ఈ కష్ట సమయంలో.. తమ ఆలోచనలన్నీ బాధిత కుటుంబాల వెంటే ఉన్నాయన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

భూటాన్​ ప్రధాని సంతాపం

సీడీఎస్​ బిపిన్​ రావత్​ సహా ఆర్మీ అధికారుల మృతి పట్ల సంతాపం ప్రకటించారు భూటాన్​ ప్రధానమంత్రి లోటే షెరింగ్​. ' భారత్​లో హెలికాప్టర్​ ప్రమాదం జరిగి సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్​, ఆయన భార్యతో పాటు మొత్తం 13 మంది మరణించటం దిగ్భ్రాంతికి గురిచేసింది. భూటాన్​ ప్రజల తరఫును భారత్​, మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి.' అని ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

ఇదీ చూడండి: చాపర్ క్రాష్​లో​ సీడీఎస్​ రావత్​ దుర్మరణం

Last Updated : Dec 8, 2021, 8:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.