పదోతరగతి, 12వ తరగతి పరీక్షల తేదీలను సీబీఎస్ఈ ప్రకటించింది. ఫిబ్రవరి 15 నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఈ మేరకు డేట్ షీట్‌ను సీబీఎస్ఈ విడుదల చేసింది. పరీక్షలు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతాయని సీబీఎస్ఈ వెల్లడించింది. రెండు పరీక్షలకు మధ్య తగినంత సమయం ఇస్తున్నట్లు తెలిపింది. కాంపిటీటివ్ పరీక్షలు, ప్రవేశ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకొని పదో తరగతి ఎగ్జామ్స్‌ను షెడ్యూల్ చేసినట్లు తెలిపింది. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మొదలై మార్చి 21వరకు కొనసాగనుండగా.. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న మొదలై ఏప్రిల్ 5వరకు జరుగుతాయని బోర్డు తెలిపింది. పరీక్షలు రాయనున్న విద్యార్థులకు బోర్డు పరీక్షల కంట్రోలర్ డా. సన్యం భరద్వాజ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
సీబీఎస్‌ఈ పదో తరగతి షెడ్యూల్..



12వ తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్ ఇదే..




