ETV Bharat / bharat

'9-12 తరగతులకు సిలబస్​ తగ్గించం' - సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యూకేషన్

2021-22 విద్యాసంవత్సరానికి 9-12 తరగతులకు సిలబస్​లో ఎలాంటి కోత ఉండదని స్పష్టం చేసింది సీబీఎస్​ఈ బోర్డు. కరోనా నేపథ్యంలో గత ఏడాది తొలగించిన పాఠ్యాంశాలను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు వచ్చే ఏడాది పాఠ్య ప్రణాళికను విడుదల చేసింది.

CBSE
సీబీఎస్​ఈ
author img

By

Published : Apr 3, 2021, 5:06 AM IST

కరోనా కారణంగా పాఠశాలలపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పుడిప్పుడే విద్యాసంస్థలు తెరుచుకుంటున్నాయి. ఈ క్రమంలో 2021-22 ఏడాది పాఠ్య ప్రణాళికను విడుదల చేసింది సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యూకేషన్​ (సీబీఎస్​ఈ). వచ్చే విద్యా సంవత్సరంలో 9 నుంచి12వ తరగతులకు సిలబల్​లో ఎలాంటి కోత విధించటం లేదని స్పష్టం చేసింది. గత ఏడాది సిలబస్​లో 30 శాతం కోత విధించిన ఛాప్టర్స్​, టాపిక్స్​ను తిరిగి ఈ ఏడాది పాఠ్యాంశాల్లో పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది సీబీఎస్​ఈ.

"ఆన్​లైన్​ తరగతులు కొత్త విధానం కావటం వల్ల పాఠ్యాంశాల తగ్గింపు ఒక్కసారి కోసం తీసుకున్న నిర్ణయమేనని గత ఏడాదే బోర్డు ప్రకటించింది. వచ్చే విద్యాసంవత్సరంలో యథావిధిగా పాత సిలబస్​ ఉంటుంది "

- సీబీఎస్​ఈ అధికారి.

కరోనా సంక్షోభం నేపథ్యంలో విద్యార్థులపై భారాన్ని తగ్గించేందుకు 2020-21 విద్యాసంవత్సరంలో 9-12 తరగతుల సిలబస్​లో 30 తగ్గించింది సీబీఎస్​ఈ. ఈ సిలబస్​ ప్రకారమే విద్యార్థులు మే-జూన్​ మధ్య పరీక్షలు రాయనున్నారు.

ఇదీ చూడండి: సీబీఎస్​ఈ 10, 12 తరగతుల పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.