ETV Bharat / bharat

CBSE కీలక నిర్ణయం- ఇక నుంచి బోర్డ్ ఎగ్జామ్స్​లో నో గ్రేడ్స్​ - సీబీఎస్​ఈ బోర్డు ఎగ్జామ్స్

CBSE New Rule In Marks : బోర్డు పరీక్షా ఫలితాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది సీబీఎస్​ఈ. ఇక నుంచి 10, 12వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలలో మార్కుల శాతం, గ్రేడ్​లు ఇవ్వమని తెలిపింది.

cbse new rule in marks
cbse new rule in marks
author img

By PTI

Published : Dec 1, 2023, 1:56 PM IST

Updated : Dec 1, 2023, 2:20 PM IST

CBSE New Rule In Marks : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్​ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 10, 12వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలలో మార్కుల శాతం, గ్రేడ్​లు ఇవ్వమని సీబీఎస్​ఈ ఎగ్జామినర్ భరద్వాజ తెలిపారు. ఉన్నత విద్య లేదా ఉద్యోగంలో మార్కుల శాతం అవసరమైతే.. అడ్మిషన్ ఇచ్చిన సంస్థే విద్యార్థి ఐదు బెస్ట్ సబ్జెక్ట్​లను నిర్ణయించుకోవాలని సూచించారు.
కొన్నాళ్ల క్రితం సీబీఎస్​ఈ మెరిట్ జాబితాను విడుదల చేసే పద్ధతిని తొలగించింది. ఇప్పుడు ఈ మార్పులు చేసింది.

CBSE Board Exams Twice A Year : ఈ ఏడాది అక్టోబరు 8న.. సీబీఎస్ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండు సార్లు రాయడం తప్పనిసరేమీ కాదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పీటీఐ వార్తా సంస్థతో ముఖాముఖిలో వెల్లడించారు. సంవత్సరానికి పరీక్ష రాసే అవకాశం ఒక్కసారే ఉంటుందనే కారణంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవతున్నారని, అందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి వివరించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

కొన్నాళ్ల క్రితం.. 10, 12వ తరగతి విద్యార్థులకు నిర్వహించే వార్షిక పరీక్షల్లో కీలక మార్పులను తెస్తున్నట్లు ప్రకటించింది సీబీఎస్​ఈ బోర్డు. 2024 విద్యా సంవత్సరం నుంచి నిర్వహించే​ పరీక్షలలో అత్యధిక మార్కులు మల్టిపుల్​ ఛాయిస్​ ప్రశ్నలకే కేటాయించనున్నట్లు తెలిపింది. షార్ట్, లాంగ్ ఆన్సర్​ టైప్​ ప్రశ్నలకు ఇంతకుముందు ఉన్న మార్కుల వెయిటేజీని తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. 2024లో జరగబోయే సీబీఎస్​ఈ 10, 12వ తరగతి పరీక్షల నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని స్పష్టం చేసింది బోర్డు. కొత్తగా మల్టిపుల్​ ఛాయిస్​ ప్రశ్నలను ప్రవేశపెట్టడం ద్వారా వివిధ రకాల ప్రశ్నలకు ఇదివరకు ఉన్న మార్కుల వెయిటేజీ తగ్గనున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయంతో ప్రశ్నాపత్రాల మూల్యాంకన విధానంలో కూడా పలు మార్పులు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. నేషనల్​ ఎడ్యూకేషన్​ పాలసీ(ఎన్​ఈపీ)-2020 సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని బోర్డు తెలిపింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

బెంగళూరులో అనేక స్కూళ్లకు బాంబు బెదిరింపులు- పేరెంట్స్​లో టెన్షన్- పోలీసులు అలర్ట్

పెళ్లికి ఒప్పుకోలేదని లవర్​పై కోపం- స్కూల్​ నుంచి బయటకు రాగానే టీచర్ కిడ్నాప్

Last Updated : Dec 1, 2023, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.