ETV Bharat / bharat

మాజీ మంత్రి ఇంట్లో సీబీఐ సోదాలు

ఐఎంఏ పోంజి కుంభకోణంలో అరెస్టైన కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రోషన్ బేగ్ నివాసంలో సీబీఐ సోదాలు చేపట్టింది. బేగ్​ కుమారుడి నివాసం, కార్యాలయంలోనూ తనిఖీలు చేసింది.

CBI
సీబీఐ
author img

By

Published : Nov 23, 2020, 1:20 PM IST

కర్ణాటక మాజీ మంత్రి రోషన్ బేగ్​ నివాసంలో సోమవారం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోదాలు నిర్వహించింది. బేగ్​ నివాసానికి ఉదయం చేరుకున్న సీబీఐ.. ఆయన కుమారుడి కార్యాలయం, ఇంటిలోనూ తనిఖీలు చేపట్టింది.

వందల కోట్ల రూపాయల 'ఐఎంఏ' పోంజి కుంభకోణం కేసులో బేగ్ ఆదివారం అరెస్టు అయ్యారు. ప్రస్తుతం ఆయన పరప్పణ అగ్రహార జైలులో క్వారంటైన్​లో ఉన్నారు.

ఐఎంఏ సంస్థ.. పెట్టుబడుల స్కీమ్​ ద్వారా రూ.4 వేల కోట్ల మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి బేగ్​కు రూ.400 కోట్లు ఇచ్చినట్లు ఐఎంఏ వ్యవస్థాపకుడు మన్సూర్ ఆలీఖాన్ ఆరోపించారు. ఈ విషయాన్ని బేగ్ ఖండించారు.

ఇదీ చూడండి: ఆ రాష్ట్ర గవర్నర్​కు కరోనా పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.