Lalu Prasad Yadav CBI: బెయిల్‌పై ఇటీవలే విడుదలైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరో షాక్ తగిలింది. పట్నాలోని ఆయన నివాసంపై సీబీఐ అధికారులు దాడులు చేశారు. లాలూ సతీమణి రబ్రీ దేవి ఇల్లు సహా దిల్లీ, బిహార్‌లో లాలూకు చెందిన మొత్తం 17 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. అయితే 2004 నుంచి 2009 వరకు లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన ఆధారాల కోసమే సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Lalu CBI Raids: యూపీఏ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. ఆశావహుల నుంచి భూములు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరిలో చాలామందికి ఉద్యోగాలు కూడా వచ్చాయని తెలుస్తోంది. ఈ కుంభకోణానికి సంబంధించే సీబీఐ లాలూపై కేసు నమోదు చేసింది. ఇప్పుడు ఆయనకు చెందిన నివాసాలపై దాడులు చేసింది.
![CBI Raid At Lalu Yadav Residence](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8aaa98832c5e53c55ba7e0275b4e5746_0405a_1651684706_728.jpg)
Lalu Prasad: అయితే సీబీఐ చర్యలను ఆర్జేడీ నాయకులు విమర్శిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ పూర్తి పక్షపాతంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. కావాలనే తమ నేతను టార్గెట్ చేశారని ఆరోపిస్తున్నారు. బలమైన గొంతుకను అణచివేసేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని ఆర్జేడీ సీనియర్ నేత ఆలోక్ మెహతా ధ్వజమెత్తారు. సీబీఐ తీరుపై మండిపడ్డారు.
ఇదీ చదవండి: క్వాడ్ సదస్సు కోసం జపాన్‌కు మోదీ... ఆ నేతలతో చర్చలు!