ETV Bharat / bharat

Steel Plant: '8.5 కోట్ల మంది వంద రూపాయల చొప్పున విరాళమిస్తే..' - విశాఖ వార్తలు

CBI EX JD Lakshminarayana: విశాఖ ఉక్కులో వర్కింగ్ కేపిటల్, ముడి సరకు భాగస్వామ్యం కోసం ఎక్స్​ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఈఓఐ) బిడ్డింగ్‌ ప్రక్రియలో సీబిఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ప్రజల భాగస్వామ్యంతో క్రౌడ్ ఫండింగ్ విధానంలో నిధులను సేకరించే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. స్టీల్‌ ఫ్లాంట్‌ సీజీఎం మార్కెటింగ్‌ సత్యానంద్‌కి స్వయంగా బిడ్డింగ్‌ పత్రాలు అందజేశారు.

Vizag Steel Plan
క్రౌడ్ ఫండింగ్​
author img

By

Published : Apr 15, 2023, 8:23 PM IST

Updated : Apr 15, 2023, 8:29 PM IST

Bids For Vizag Steel Plant: విశాఖ ఉక్కులో వర్కింగ్ కేపిటల్, ముడి సరకు భాగస్వామ్యం కోసం ఎక్స్​ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఈఓఐ) కోసం బిడ్ల దాఖలు గడువు మరో ఐదు రోజుల పాటు పొడిగించారు. 21 బిడ్లు అన్ లైన్ ద్వారా దాఖలైనట్టు తెలుస్తోంది. మరో బిడ్ సిబిఐ పూర్వపు జేడి లక్ష్మీనారాయణ నేరుగా దాఖలు చేశారు. ఇప్పటివరకు 22 బిడ్లు దాఖలైనట్టయింది.

సీబిఐ పూర్వ జేడి లక్ష్మీనారాయణ స్టీల్‌ ఫ్లాంట్‌ సీజీఎం మార్కెటింగ్‌ సత్యానంద్‌కి స్వయంగా బిడ్డింగ్‌ పత్రాలు అందజేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం తెలుగువారందరికి బిడ్డలాంటిదని తెలిపారు. ఉక్కు పరిశ్రమను జాగ్రత్తగా కాపాడుకోవడం మనందరి బాధ్యతగా అయన అన్నారు. అందువల్లనే తాము ఒక ప్రయివేటు కంపెనీ తరుఫున బిడ్​ను దాఖలు చేసినట్టు లక్ష్మీనారాయణ వివరించారు. ప్రజల తరుఫున ఈ బిడ్ దాఖలు చేశామని లక్ష్మీనారాయణ వెల్లడించారు. నిధులను సేకరించేందుకు కొత్త విధానం ద్వారా ముందుకు వస్తామని లక్ష్మీనారాయణ తెలిపారు. క్రౌడ్ ఫండింగ్, డిజిటల్ ట్రాన్స్​ఫర్ వంటి విధానాల ద్వారా నిధులను సేకరించే వెసులుబాటు ఉందన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు రూ. 8.5 కోట్ల మంది నెలకు వంద రూపాయిల చొప్పున విరాళం ఇస్తే నెలకు రూ. 850 కోట్ల రూపాయలు జమ అవుతాయన్నారు లక్ష్మీనారాయణ. ఇలా నాలుగు నెలలు పాటు చేయగలిగితే స్టీల్ ప్లాంట్​ను నిలబెట్టిన వాళ్లలో మనం కూడా ఉండే అవకాశం ఉంటుందని అయన వివరించారు.

ప్రజల తరుఫున బిడ్ దాఖలు చేసిన పూర్వపు సిబిఐ జెడి లక్ష్మీనారాయణ

తొలుత నిర్ణయించిన ప్రకారం ఈ మధ్యాహ్నం మూడు గంటలతో బిడ్ల దాఖలు గడువు ముగియాల్సి ఉంది. ఇదే సమయంలో మరో ఐదు రోజుల వరకు ఈఓఐ దాఖలుకు గడువు పెంపుదల చేస్తున్నట్టు ఆర్​ఐఎన్​ఎల్ సమాచారం ఇచ్చింది. సింగరేణి సంస్ధ తరుఫున బిడ్ ఇంకా దాఖలు కాకపోవడం వారు మరింత సమయం అడిగినట్టు సమాచారం. ఇంకా పలు సంస్ధల నుంచి బిడ్​లు దాఖలవుతాయన్న అంచనాలతో ఈ గడువును పొడిగించారు.

'విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం వినూత్న ప్రయత్నం ద్వారా ప్రజల భాగస్వామ్యంతో నిధులను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందుకు సంబందించి ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రసార మాధ్యమాలు, వివిధ పెమెంట్స్ యాప్​ల ద్వారా క్రౌడ్ ఫండింగ్, డిజిటల్ ట్రాన్స్​ఫర్ వంటి విధానాల ద్వారా నిధులను సేకరించే వెసులు బాటును పరిశీలిస్తున్నాం. 8.5 కోట్ల మంది నెలకు వంద రూపాయల చొప్పున విరాళం ఇస్తే నెలకు 850 కోట్ల రూపాయలు జమ అవుతాయి. ఇలా నాలుగునెలలు పాటు చేయగలిగితే స్టీల్ ప్లాంట్​ను నిలబెట్టిన వాళ్లలో మనం కూడా ఉండే అవకాశం ఉంటుంది'-. లక్ష్మీనారాయణ,సీబిఐ పూర్వ జేడీ

ఇవీ చదవండి:

Last Updated : Apr 15, 2023, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.