ETV Bharat / bharat

ఇద్దరు డ్వాక్రా మహిళల మధ్య గొడవ.. తనపై తానే కేసు పెట్టుకున్న పోలీస్​.. కారణమిదే! - case against police officer

తనపై తాను కేసు నమోదు చేసుకున్నారు ఓ పోలీసు అధికారి. కోర్టు ఆదేశాలతో తనతో పాటు మరో 14 మందిపై కేసు నమోదు చేశారు. ఉత్తర్​ప్రదేశ్​ మహారాజ్​గంజ్​లో ఈ ఘటన జరిగింది.

court case against police officer
court case against police officer
author img

By

Published : Jun 19, 2023, 10:18 AM IST

Updated : Jun 19, 2023, 10:29 AM IST

తనపై తానే కేసు నమోదు చేసుకున్నారు ఓ పోలీసు అధికారి. ఇదేంటీ నిందితులపై కదా కేసు నమోదు చేయాల్సింది అనుకుంటున్నారా! ఓ నిందితుడికి సహాయం చేస్తూ ఫిర్యాదు తీసుకోకపోవడం వల్ల ఆగ్రహించిన న్యాయస్థానం.. ఆ పోలీసుపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ వింత ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని మహారాజ్​గంజ్​లోని కోల్హూయి పోలీస్ స్టేషన్​లో జరిగింది.

ఇదీ జరిగింది
కోల్హూయి పోలీస్​ స్టేషన్ పరిధిలోని బఢహర శివనాథ్​ గ్రామానికి చెందిన సూర్య ప్రకాశ్​ చౌదరి భార్య సీమా.. స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా ఉంది. అయితే, ఆ సంఘం అధ్యక్షురాలైన గ్రామ సర్పంచ్ మోహిత్ శర్మ భార్య షీలా దేవి రూ. 15,000 కాజేసింది. దీనిని గమనించిన సీమా.. వాటి లెక్కలు చూపాలంటూ షీలాదేవిని ప్రశ్నించింది. దీంతో ఆగ్రహానికి గురైన షీలాదేవి భర్త మోహిత్ యాదవ్​.. ఏప్రిల్​ 6న తన అనుచరులతో కలిసి అమె ఇంటిపై దాడి చేశారు. అసభ్య పదజాలంతో దూషించి చంపేస్తామంటూ బెదిరించారు.

వెంటనే సీమా భర్త సూర్య ప్రకాశ్ చౌదరి.. ఫిర్యాదు చేసేందుకు పోలీస్​ స్టేషన్​కు వెళ్లగా.. పోలీసులు ఫిర్యాదును స్వీకరించలేదు. పైగా అతడిని కొట్టి పోలీస్ స్టేషన్​ నుంచి తరిమేశారు. పోలీసులు స్పందించకపోవడం వల్ల న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు బాధితుడు. దీనిపై విచారించిన కోర్టు.. కోల్హూయి పోలీస్ స్టేషన్ అధికారి మహేంద్ర యాదవ్​ సహా గ్రామ సర్పంచ్​ మోహిత్ శర్మ, భార్య షీలా దేవితో పాటు మరో 14 మందిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో తనతో పాటు మరో 14 మందిపై వివిధ సెక్షన కింద కేసు నమోదు చేశారు మహేంద్ర యాదవ్​.

"కోర్టు ఆదేశాలతో కోల్హూయి పోలీస్ స్టేషన్ ఆఫీసర్​ మహేంద్ర యాదవ్​ సహా 14 మందిపై కేసు నమోదైంది. వీరందరిపై వివిధ సెక్షన కింద కేసు నమోదు చేశాం. ఈ కేసు విచారణను ఫరేంద్ర పోలీస్ స్టేషన్​కు అప్పగించాం. విచారణ పూర్తైన తర్వాత ఛార్జ్​షీట్​ను కోర్టుకు సమర్పిస్తాం."

--అనూజ్​ కుమార్ సింగ్​, ఫరేంద్ర పోలీస్ స్టేషన్ ఆఫీసర్​

నలుగురు పోలీసులకు జైలుశిక్ష
అంతకుముందు తెలంగాణలో కూడా ఓ ఘటన జరిగింది. కోర్టు ధిక్కరణ కేసులో నలుగురు పోలీసు అధికారులకు జైలు శిక్ష విధించింది హైకోర్టు. నలుగురికి 4 వారాల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. భార్యాభర్తల వివాదం కేసులో సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని నలుగురిపై ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు సీఆర్‌పీసీ 41ఏ నోటీసు ఇవ్వలేదని పోలీసులపై అభియోగం నమోదైంది. గతేడాది జక్కా వినోద్ కుమార్ రెడ్డి, జక్కా సౌజన్య రెడ్డి దాఖలు చేసిన పిటిషన్​పై ఇవాళ హైకోర్టు తీర్పు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Last Updated : Jun 19, 2023, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.