ముంబయిలోని రామ్‌నివాస్ సొసైటీ వద్ద ఉన్న బావిపై నిర్మించిన స్లాబ్ కూలిపోయి, అక్కడ పార్క్ చేసిన కారు మునిగిపోయింది. అదృష్టవశాత్తు కారులో ఎవరు లేనందున ప్రమాదం తప్పింది.
చాలా ఏళ్ల క్రితం రామ్‌నివాస్ సొసైటీలో దారికి అడ్డంగా ఉందని ఓ పాడు బడ్డ బావిని థార్, కాంక్రీట్‌తో కప్పివేశారు. రోజూ సోసైటీ సభ్యులు తమ కార్లను అక్కడే పార్క్ చేసేవారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు థార్, కాంక్రీట్ కొట్టుకుపోయింది. అది గమనించని స్థానికులు వాహనాలను అక్కడే పార్క్ చేశారు. ఫలితంగా కారు బరువుకు బావి పైకప్పు కుంగిపోయి వాహనం అందులోని నీటిలో మునిగిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి: 'మహా' రాజకీయాన్ని మార్చిన మోదీ-ఉద్ధవ్ భేటీ!