ఉత్తరాఖండ్‌లో ఓ ఫ్లై ఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నోయిడా నుంచి హరిద్వార్‌కు ప్రయాణిస్తున్న కారును బస్సు ఢీకొట్టింది. దీంతో కారులో 30 అడుగుల నదిలో పడిపోయింది. ఈ సమయంలో కారులో ఓ జంట ప్రయాణిస్తుంది. ఎండిన నదిలో పడిపోవడం వల్ల ఆ జంట.. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. నదిలో చిక్కుకున్న జంటను రక్షించారు.
ఈ ఘటనతో ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బహదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పతంజలి యోగపీఠ్‌కు ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్‌ను దంపతులు దాటుతుండగా.. కారును బస్సు ఢీకొట్టింది. దీంతో ప్లైఓవర్ రైలింగ్ విరిగి కారు ఎండిపోయిన నదిలో పడిపోయింది. ఈ జంటను యూపీలోని గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ ఆల్ఫా 1లో నివాసం ఉంటున్న నవీన్ రస్తోగి, అతడి భార్య అంజు రస్తోగిగా గుర్తించారు.