Camping vehicle: దూర ప్రాంతాల్లో పర్యటించాలంటే అన్ని సౌకర్యాలతో కూడిన వాహనం అవసరమవుతుంది. అందుకు ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి వస్తుంది. చాలా మంది ట్రావెలర్స్‌కు అది సాధ్యపడకపోవచ్చు. అలాంటి పరిస్థితిలో ఉన్న ఓ విద్యార్థి సరికొత్త ఆలోచన చేశాడు. దేశవ్యాప్తంగా పర్యటించాలనే లక్ష్యంతో సొంతంగా ఓ వాహనాన్ని రూపొందించాడు. అతనే కేరళలోని కొజికోడ్ జిల్లా పదనిలమ్కు చెందిన మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థి ఆకాశ్ కృష్ణ.
తొలుత పాతసామన్ల దుకాణం నుంచి తీసుకొచ్చిన సామగ్రితో గేర్ సైకిల్‌ను రూపొందించాడు ఆకాశ్. సైకిల్‌కు ఓ మోటార్‌ను బిగించాడు. ఆ తర్వాత ట్రావెలింగ్ కోసం రూపొందించిన 'క్యాంపర్-క్యాప్సుల్'ను జత చేశాడు.
క్యాంపర్ వాహనాన్ని పీవీసీ బోర్డులు, మెటల్ ఫ్రేములతో సిద్ధం చేశాడు ఆకాశ్. అందులో ఇద్దరు వ్యక్తులు సౌకర్యవంతంగా నిద్రపోవచ్చు. అలాగే.. చిన్న ఫ్రిడ్జ్, ఇన్వర్టర్, వాటర్ కూలర్, టీవీ, ఎగ్జాస్ట్ ఫ్యాన్, సెక్యూరిటీ అలారమ్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. విద్యుత్తు కోసం క్యాంపింగ్ క్యాప్సుల్‌పై సోలార్ ప్యానల్స్‌ను బిగించాడు. క్యాంపర్కు స్కూటర్ టైర్లు వినియోగించాడు. ఇందు కోసం రూ.65వేలు ఖర్చు చేశానని.. ఈ క్యాంపర్ సాయంతో దేశవ్యాప్తంగా పర్యటించాలనేదే తన లక్ష్యమని తెలిపాడు.
తన ప్రత్యేక వాహనంలో ప్రయాణించేందుకు అనుమతి కోసం రాష్ట్ర మోటార్ వెహికిల్ విభాగాన్ని ఆశ్రయిస్తానని, అనుమతులు వచ్చాక ముందుగా రాష్ట్రం మొత్తం చక్కర్లు కొట్టొస్తానని చెబుతున్నాడు ఆకాశ్ కృష్ణ.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: స్నేక్ శరణ్య: పాములు పట్టడంలో సెంచరీ కొట్టిన యువతి