ETV Bharat / bharat

చాయ్​ ప్రేమికుల కోసం మరో కొత్త టీ.. డయాబెటిస్​కు చెక్​!

Camel Milk Tea: గ్రీన్​ టీ, బ్లాక్​ టీ, హెర్బల్​ టీ ఇలా చాయ్​లో చాలా వెరైటీల గురించి విన్నాం. అయితే క్యామెల్​ టీ గురించి ఎప్పుడైనా విన్నారా?.. అవును మీరు విన్నది నిజమే. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ టీతో షుగర్​ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు చెక్​ పెట్టొచ్చట.

Camel Milk Tea
క్యామెల్​ టీ
author img

By

Published : Mar 24, 2022, 7:38 PM IST

చాయ్​ ప్రేమికుల కోసం మరో కొత్త టీ

Camel Milk Tea: కొవిడ్​ మహమ్మారి ప్రభావంతో ప్రజలలో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. తీసుకునే ప్రతి పదార్థంలో ఆరోగ్య ప్రయోజనాలు ఉండేలా జాగ్రత్త పడుతున్నారు . ఇదే విషయాన్ని గ్రహించిన మణికందన్​.. క్యామెల్​ టీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒంటె పాలతో వ్యాపారం మొదలుపెట్టారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఈ పాలు.. ఇమ్యూనిటీని పెంచడమే కాక షుగర్​ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు చెక్​ పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు. దక్షిణాదిన క్యామెల్​ టీ అందుబాటులోకి రావడం ఇదే తొలిసారని చెప్పుకొచ్చారు.

Camel Milk Tea
క్యామెల్​ టీ
Camel Milk Tea
మణికందన్​ ఏర్పాటు చేసిన క్యామెల్​ ఫార్మ్​

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా నీలాంబర్​ ప్రాంతానికి చెందిన మణికందన్​.. ఇటీవల కొవిడ్​ బారిన పడ్డారు. మహమ్మారి నుంచి కోలుకుంటున్న క్రమంలో ఆయనకు ఒంటె పాల వల్ల కలిగే లాభాల గురించి తెలిసింది. దీంతో ఒంటె పాల వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్న మణికందన్​.. ప్రభుత్వం అనుమతితో సంగమిత్ర పేరున క్యామెల్​ మిల్క్ ఫార్మ్​ ఏర్పాటు చేశారు. లీటరు పాలను రూ.450కు విక్రయిస్తున్నారు. అంతేకాదు.. ఈ ఫార్మ్​లో ఒంటె పాలతో చేసే టీ, కాఫీ, రోస్​మిల్క్​ వంటి ఉత్పత్తులకు కూడా మంచి డిమాండ్​ ఉంది. కప్పు క్యామెల్​ టీని 30 రూపాయలకు అమ్ముతున్నారు.

Camel Milk Tea
ఒంటెలకు ఆహారం అందిస్తున్న మణికందన్
Camel Milk Tea
సంగమిత్ర క్యామెల్​ ఫార్మ్​

క్యామెల్​ మిల్క్​కు మంచి గిరాకీ లభిస్తోందంటున్నారు మణికందన్. ఇది డయాబెటిస్​ను కంట్రోల్​ చేస్తుందని చెప్పడానికి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు.. మణికందన్​ ఈ ప్రాంతాన్ని కేవలం క్యామెల్​ ఫార్మ్​కు పరిమితం చేయలేదు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు గుర్రపు స్వారీని కూడా అందుబాటులోకి తెచ్చారు. కస్టమర్లు తమ క్యామెల్​ టీ, కాఫీలు తాగి.. గుర్రపు స్వారీ చేస్తూ సేద తీరుతుంటారని చెప్పుకొచ్చారు మణికందన్.

ఇదీ చూడండి : లక్ అంటే ఈ పిల్లవాడిదే​.. బస్సు చక్రాల కింద పడినా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.