ETV Bharat / bharat

ఆ దేశాల్లో భారత రాయబార కార్యాలయాల ఏర్పాటు - central cabinet key decisions

ఎస్టోనియా, పరాగ్వే, డొమినికన్ రిపబ్లిక్​ దేశాల్లో భారత రాయబార కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రధాని మోదీ అధ్యక్షన జరిగిన ఈ సమావేశంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కృష్ణపట్నం సహా కర్ణాటకలోని తుమకూరులో పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయాలని తీర్మానించింది.

Cabinet nod to opening Indian missions in Estonia, Paraguay, Dominican Republic
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
author img

By

Published : Dec 30, 2020, 7:51 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంతో బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్టోనియా, పరాగ్వే, డొమినికన్ రిపబ్లిక్ దేశాల్లో భారత కార్యాలయాలు ఏర్పాటు చేయాలనే తీర్మానానికి ఆమోదం తెలిపినట్లు మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. ఈ మూడు దేశాలతో వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు. అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించి ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకోవాలనేదే ప్రధాని మోదీ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

పారాదీప్​కు రూ.3వేల కోట్ల ప్రాజెక్టు..

పారాదీప్​ ఓడరేవును అత్యాధునిక హంగులతో తీర్చిదిద్ది ప్రపంచస్థాయి నౌకాశ్రయంగా మార్చేందుకు రూ.3వేల కోట్లతో ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది కేబినెట్​. అక్కడ వెస్టర్న్​ డాక్​ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
పారిశ్రామిక కారిడార్లు..

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణపట్నం సహా కర్ణాటకలోని తుమకూరులో పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. అలాగే యూపీలోని గ్రేటర్‌ నోయిడాలో మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ హబ్‌ అండ్‌ మల్టీ మోడల్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ హబ్‌ ఏర్పాటుకు నిర్ణయించింది. రూ.7,725 కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటు చేయాలని కేబినెట్‌ తీర్మానించింది. వీటి వల్ల సుమారు 2.8 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రం అంచనా వేసింది.

ఇథనాల్​ డిస్టిలరీలకు రాయితీ..

పెట్రోల్‌లో కలిపేందుకు ఉపయోగించే ఇథనాల్‌ ఉత్పత్తి కోసం కొత్తగా ఏర్పాటు చేయబోయే డిస్టిలరీలకు రూ.4,573 కోట్ల వడ్డీ రాయితీని అందించేందుకు తీర్మానించినట్లు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ తెలిపారు. 2030 నాటికి సుమారు వెయ్యి కోట్ల లీటర్ల ఇథనాల్‌ అవసరం అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు.

ఆకాశ్​ క్షిపణి ఎగుమతులు..

ఆకాశ్‌ క్షిపణి వ్యవస్థను ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఏదైనా దేశం దరఖాస్తు చేసుకుంటే సత్వర అనుమతుల కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని తీర్మానించింది. విదేశాలకు ఎగుమతి చేయబోయే ఆకాశ్ క్షిపణి వ్యవస్థ.. ప్రస్తుతం భారత దళాలు వినియోగిస్తున్న దానికంటే భిన్నంగా ఉంటుందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ట్వీట్‌ చేశారు.

ఇదీ చూడండి: 'ఆర్జేడీలోకి 17 మంది జేడీయూ ఎమ్మెల్యేలు!'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.