ETV Bharat / bharat

'మహిళా వ్యతిరేక చర్యలపై గళమెత్తాల్సిన సమయమిదే!' - bulli bai app incident

Congress on Bulli Bai app incident: మహిళలను అవమానించడం, మత విద్వేషాలకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ అన్నారు. ఓ వర్గానికి చెందిన మహిళలే లక్ష్యంగా 'బుల్లీ బాయ్​' యాప్​ పేరుతో దుండగుల వికృత చేష్టలకు పాల్పడిన నేపథ్యంలో రాహుల్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

Bulli Bai App incident
Bulli Bai App incident
author img

By

Published : Jan 3, 2022, 4:40 AM IST

Congress on Bulli Bai app incident: మహిళలను అవమానించడం, మత విద్వేషాలకు వ్యతిరేకంగా గళం విప్పాలని ప్రజలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. ఇందుకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఓ వర్గానికి చెందిన మహిళలే లక్ష్యంగా 'బుల్లీ బాయ్​' యాప్​ పేరుతో దుండగుల వికృత చేష్టలకు పాల్పడిన నేపథ్యంలో రాహుల్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

"మహిళలను అవమానించడం, మత విద్వేషాలకు వ్యతిరేకంగా ఒకే స్వరం వినిపించినప్పుడే అవి ఆగుతాయి. సంవత్సరం మారింది. పరిస్థితులు కూడా మారాలి. మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది" అంటూ నో ఫియర్ హ్యాస్​ ట్యాగ్​తో రాహుల్​ ట్వీట్ చేశారు.

'మోదీజీ మౌనం వీడండి'

లద్దాఖ్​, అరుణాచల్​ ప్రదేశ్​ సరిహద్దుల్లో చైనా చొరబాట్లు లక్ష్యంగా కేంద్రంపై విమర్శలు గుప్పించింది కాంగ్రెస్​.​ గల్వాన్​లో చైనా దురాక్రమణపై ప్రధాని నరేంద్ర మోదీ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని, ఇకనైనా మౌనం వీడాలని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ కోరారు.

"గల్వాన్‌లో మన త్రివర్ణ పతాకం బాగుంది. చైనాపై స్పందించాలి. మోదీ జీ మౌనం వీడండి" అని రాహుల్​ ట్వీట్​ చేశారు.

అంతకముందు అరుణాచల్​ ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడంపై రాహుల్​​ ఆందోళన వ్యక్తం చేశారు. "కొద్ది రోజుల క్రితం 1971లో భారత్​ సాధించిన అద్భుతమైన విజయాన్ని గుర్తుచేసుకున్నాం. దేశ భద్రత, విజయం కోసం తెలివైన బలమైన నిర్ణయాలు అవసరం. బూటకపు మాటల వల్ల దేన్ని సాధించలేం" అని ట్వీట్​ చేశారు.

ఇవీ చూడండి:

మహిళల వేలం పేరుతో వికృత చేష్టలు.. ఆ యాప్‌ బ్యాన్!

అరుణాచల్​ ప్రాంతాలకు పేర్లు పెట్టడాన్ని సమర్థించుకున్న చైనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.