ETV Bharat / bharat

'బుల్​డోజర్లు అక్రమార్కుల కోసమే.. పేదవారిపై వాడొద్దు'

Bulldozers In Up: అక్రమార్కుల ఇళ్లపై మాత్రమే బుల్​డోజర్లను వినియోగించాలని యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ అధికారులకు తెలిపారు. పేదవారి గుడిసెలు, దుకాణాలను ముట్టరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Bulldozers In Up
యోగీ
author img

By

Published : Apr 8, 2022, 10:48 PM IST

Bulldozers In Up: ఉత్తర్​ప్రదేశ్​లో బుల్​డోజర్​ కూల్చివేతల పరంపర కొనసాగుతోంది. అత్యాచారం, ఇతర కేసుల్లో నిందితుల ఆస్తులపై బుల్​డోజర్లు​ ప్రతాపం చూపిస్తున్నాయి. ఈ క్రమంలో పేదవారి గుడిసెలు, దుకాణాలను కూల్చివేయరాదని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అధికారులకు శుక్రవారం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అక్రమార్కుల ఆస్తులపైనే బుల్​డోజర్లను వినియోగించాలని తెలిపారు.

"పేదవారి గుడిసెలు, దుకాణాలపై బుల్​డోజర్లను ఉపయోగించరాదు. అక్రమంగా సంపాదించి నేరస్థులు కట్టిన కట్టడాలపైనే వాటిని వాడాలి. పేదవారి ఆస్తులను దౌర్జన్యంగా లాగేసుకున్నవారి ఆస్తులపైనే చర్యలు చేపట్టాలి."

-యోగీ ఆదిత్యనాథ్​, యూపీ సీఎం

'బుల్​డోజర్​ బాబా'గా పేరుతెచ్చుకున్న యోగి.. పాలనలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉత్తర్​ప్రదేశ్​ను నేరస్థులు, మాఫియా నియంత్రించలేరని బుల్​డోజర్లతో సమాధానమిస్తున్నారు. దీంతో ప్రభుత్వం పట్ల పేదలకు నమ్మకం పెరుగుతోంది. అధికారులు నేరస్థుల ఇళ్లను బుల్​డోజర్లతో పడగొట్టిస్తున్నారు. దీంతో 50 మంది నేరస్థులు స్వచ్ఛందంగా నేరాన్ని ఒప్పుకుని పోలీసులకు లొంగిపోయారు. ప్రముఖ రాజకీయ నాయకులు సైతం ఇందుకు మినహాయింపు కాదు. సమాజ్​వాదీ పార్టీ ఎమ్మెల్యే షాజిల్ ఇస్లామ్ అన్సారీకి చెందిన పెట్రోల్​ బంక్​ను అధికారులు గురువారం కూల్చేశారు. బరేలీ-దిల్లీ జాతీయ రహదారిపై పర్సాఖేడా వద్ద ఉన్న బంక్​ను అక్రమంగా నిర్మించారన్నది వారి వాదన. ఇదే విషయంపై ఇప్పటికే నోటీసులు ఇచ్చినా స్పందన లేదని.. అందుకే ఈ చర్యలు చేపట్టినట్టు చెప్పారు బరేలీ అభివృద్ధి ప్రాధికార సంస్థ(బీడీఏ) వైస్ ఛైర్మన్ జోగేంద్ర సింగ్.

ఇదీ చదవండి: యోగికి వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యేకు 'బుల్​డోజర్ దెబ్బ'- పెట్రోల్ బంక్ ఫసక్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.