భారత సరిహద్దు బలగాలు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నాయి. అనుకోకుండా పాక్ సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించిన ఇద్దరు పౌరులను.. ఆ దేశానికి అప్పగించినట్టు అధికారులు తెలిపారు.
ఇదీ జరిగింది..
భారత్-పాక్ సరిహద్దులో 14వ బెటాలియన్ దళాలు గస్తీ కాస్తున్న సమయంలో.. ఇద్దరు పాకిస్థానీయులు అనుమానాస్పద రీతిలో భారత భూభాగంలో తిరుగుతున్నారు. వారు సరిహద్దును దాటి ఫెన్సింగ్ వైపునకు వెళ్తుండగా జవాన్లు అడ్డుకున్నారు. విచారించగా.. పొరపాటున మన దేశంలోకి ప్రవేశించినట్టు వెల్లడైంది. వారి నుంచి ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించనందున.. సానుకూలంగా స్పందించింది సైన్యం. వారిని పాక్ రేంజర్లకు అప్పగించి మానవత్వాన్ని చాటుకుంది.
సరిహద్దులో తరచూ ఎదురవుతున్న ఈ తరహా ఘటనలపై దాయాది దేశం రేంజర్స్ వద్ద నిరసన తెలిపినట్టు బీఎస్ఎఫ్ తెలిపింది. ఈ ఏడాది మొత్తం ఆరుగురు పాక్ వాసులు దేశంలోకి రాగా.. వారిని అక్కడి రేంజర్లకు అప్పగించినట్టు స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: ఆ బీచ్‌లకు కొట్టుకొచ్చిన మృతదేహాలు.. వారివేనా?