ETV Bharat / bharat

భారత జలాల్లోకి పాక్​ బోట్లు.. సీజ్​ చేసిన బీఎస్​ఎఫ్​ - గుజరాత్​ వార్తలు తాజా

గుజరాత్​లో సరిహద్దు ప్రాంతంలో 11 పాకిస్థాన్​ బోట్లను స్వాధీనం చేసుకుంది బీఎస్​ఎఫ్​. ఈ ఘటనకు సంబంధించి సమగ్ర దర్యాప్తును చేపడుతున్నారు అధికారులు.

bsf
బీఎస్​ఎఫ్
author img

By

Published : Feb 10, 2022, 9:55 PM IST

Updated : Feb 10, 2022, 10:40 PM IST

భారత సరిహద్దు జలాల్లోకి ప్రవేశించిన 11 పాకిస్థాన్​ బోట్లను సరిహద్దు భద్రతా దళం స్వాధీనం చేసుకుంది. గుజరాత్​లోని కచ్​ జిల్లా హరమినాలా ప్రాంతంలో నిర్వహించిన సెర్చ్​ ఆపరేషన్​లో ఈ బోట్లను గుర్తించారు అధికారులు. ఈ పడవలు భారత జలాల్లోకి ఎందుకు ప్రవేశించాయి అనే విషయంపై దర్యాప్తు చేపడుతున్నారు. ఆ బోటుకు సంబంధించిన వ్యక్తుల కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ఘటనాస్థలంలో దట్టమైన చెట్లు ఉండటం, అలలు తీవ్రంగా ఉండటం వల్ల సైనికులకు గాలింపు చర్యలు చేపట్టడం సవాల్​గా మారిందన్నారు అధికారులు పేర్కొన్నారు.

పాక్​ చెరలో భారత జాలర్లు..

గడిచిన 15 రోజుల్లో అనేక మంది భారత జాలర్లు పాకిస్థాన్ చెరలో చిక్కుకున్నారు. చేపల వేటకు వెళ్లిన జాలర్లను పాకిస్థాన్​ అపహరిస్తోందని బాధితుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అపహరణకు గురైన ఓ జాలర్ల బృందం కూడా చివరగా ఇదే విషయాన్ని వెల్లడించినట్లు ఇటీవల అధికారులు వెల్లడించారు. ఇటీవల కాలంలో పాకిస్థాన్​ 50కుపైగా భారత జాలర్లను అపహరించింది.

అంతకుముందు.. తమ చెరలో ఉన్న కొంతమంది భారత జాలర్లను మానవతా దృక్పథంతో విడుదల చేస్తున్నామని పేర్కొంటూ పాక్​ వారిని విడుదల చేసింది. కానీ అది జరిగిన కొన్ని రోజులకే మళ్లీ జాలర్ల అపహరణలు మొదలు కావడం గమనార్హం.

ఇదీ చూడండి : మహిళలతో బాడీ మసాజ్​ కోసం దొంగతనాలు.. రూ.వేలల్లో టిప్పు

Last Updated : Feb 10, 2022, 10:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.