మహిళలు ట్రాక్టర్ లాగుతుంటే మాజీ సీఎం మౌనంగా కూర్చోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. రాజకీయాల్లో అతివలను వెట్టి కార్మికుల్లా చూస్తారా అని మండిపడ్డారు. ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత, హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా చేసిన నిరసన ప్రదర్శనను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.
-
#WATCH A Cong leader sits calmly on a tractor which he is making female Cong workers pull physically...As female president of Cong,silence of Sonia Gandhi on this is also speaking volumes how women in the party are reduced to the task that even men refuse to do, says Smriti Irani pic.twitter.com/b2X4iStBwD
— ANI (@ANI) March 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH A Cong leader sits calmly on a tractor which he is making female Cong workers pull physically...As female president of Cong,silence of Sonia Gandhi on this is also speaking volumes how women in the party are reduced to the task that even men refuse to do, says Smriti Irani pic.twitter.com/b2X4iStBwD
— ANI (@ANI) March 11, 2021#WATCH A Cong leader sits calmly on a tractor which he is making female Cong workers pull physically...As female president of Cong,silence of Sonia Gandhi on this is also speaking volumes how women in the party are reduced to the task that even men refuse to do, says Smriti Irani pic.twitter.com/b2X4iStBwD
— ANI (@ANI) March 11, 2021
"కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు తాళ్లతో ట్రాక్టర్ను లాగుతుంటే.. మాజీ సీఎం సహా ఇతర నేతలు మౌనంగా కూర్చోవడం దిగ్భ్రాంతికి గురిచేసింది. నిరసన తప్పుకాదు. కానీ అందుకోసం మహిళల గౌరవాన్ని ఫణంగా పెట్టకూడదు. ఈ వ్యవహారంపై సోనియా గాంధీ మౌనం వహించడం ఆ పార్టీలో మహిళల దుస్థితికి అద్దంపడుతోంది."
- స్మృతి ఇరానీ, కేంద్రమంత్రి
కేంద్ర ప్రభుత్వం ఇందన ధరలను పెంచడాన్ని నిరసిస్తూ హరియాణా అసెంబ్లీకి సోమవారం ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు బీఎస్ హూడా. ఈ క్రమంలో ఆయన వాహనంపై కూర్చోగా.. మహిళా నేతలు దానిని లాగారు.
హుడా చర్యను తప్పుబడుతూ దిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద భాజపా మహిళా విభాగం ఆందోళన చేపట్టింది.
-
Delhi BJP women's wing protests in front of Congress headquarters, over the video where Congress leader BS Hooda was seen sitting on a tractor that was being pulled by ropes, by women MLAs. pic.twitter.com/kGjHjHNJMD
— ANI (@ANI) March 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Delhi BJP women's wing protests in front of Congress headquarters, over the video where Congress leader BS Hooda was seen sitting on a tractor that was being pulled by ropes, by women MLAs. pic.twitter.com/kGjHjHNJMD
— ANI (@ANI) March 11, 2021Delhi BJP women's wing protests in front of Congress headquarters, over the video where Congress leader BS Hooda was seen sitting on a tractor that was being pulled by ropes, by women MLAs. pic.twitter.com/kGjHjHNJMD
— ANI (@ANI) March 11, 2021
'మీరే లాగాల్సింది'
మహిళా ఎమ్మెల్యేలతో ఇలా చేయించడం వారిని వెట్టి కార్మికుల్లా పరిగణించడమేనని అన్నారు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. ఆ దృశ్యాలు చూశాక తాను రాత్రంతా నిద్రపోలేదని శాసనసభలో ఆవేదన వ్యక్తంచేశారు. నిరసన చేయాల్సి వస్తే స్వయంగా హుడానే ట్రాక్టర్ లాగాల్సిందని అన్నారు.
'ప్రభుత్వానికి కనబడటం లేదా?'
తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు హుడా. వంట గ్యాస్ సహా ఇతర నిత్యావసరాల ధరలు పెరిగి మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులతో కలిసి మహిళలు నిరసన చేయడం ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. విద్యుత్ కూడా నిలిపేశారని, వారి బాధ సర్కారుకు పట్టడంలేదని విమర్శించారు.
ఇదీ చూడండి: ప్రజా 'పరీక్ష'లో పళనిస్వామి పాస్ అయ్యేనా?