BRS Office In Delhi Opens Today: దిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం నేడు కేసీఆర్ దిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు సీఎం కేసీఆర్ హస్తినలోనే ఉండనున్నట్లు సమాచారం. పలువురు నేతలతో భేటీ కావడం సహా పార్టీ విస్తరణకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించనున్నారు. ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు మంత్రులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఇతర నేతలు దిల్లీకి పయనమయ్యారు.
జాతీయ రాజకీయాల్లో క్రీయాశీలపాత్ర పోషించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు దేశరాజధానిలో భారత్ రాష్ట్రసమితి కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు.మధ్యాహ్నం తొలుత కార్యాలయంలో యాగం నిర్వహిస్తారు. అనంతరం.. 1.05 నిమిషాలకు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఒకటిన్నర వరకు అక్కడే ఉంటారు. ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లను మంత్రి ప్రశాంత్‌రెడ్డి పర్యవేక్షించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రులు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ఇతర నేతలు దిల్లీకి బయలుదేరారు.
నిర్మాణం జరిగిన తీరు: దిల్లీ వసంత్ విహార్‌లో బీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి 2020 అక్టోబరు 9న కేంద్ర పట్టణ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ.. 1315 గజాల స్థలం కేటాయించింది. ఆ స్థలానికి బీఆర్ఎస్ మార్కెట్ విలువ ప్రకారం రూ. 8,41,37,500 కోట్లు, వార్షిక స్థల అద్దె కింద రూ. 21,03,438 చెల్లించింది. అనంతరం ఆ స్థలంలోని చిన్నపాటి కొండ తొలగించి కార్యాలయ నిర్మాణానికి అనువుగా మార్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ కార్యాలయ నిర్మాణానికి 2021 సెప్టెంబరు 2న భూమి పూజ చేశారు. నిర్మాణ పనులను ఎండీపీ ఇన్‌ఫ్రాసంస్థకు అప్పగించారు.
BRS Office In Delhi: రెండేళ్లలోపే కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కార్యాలయాన్ని ఐదు అంతస్తుల్లో నిర్మించారు. 20వేల అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఆ కార్యాలయంలో లోయర్‌గ్రౌండ్, గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు మూడుఅంతస్తుల్లో కార్యాలయాలు, కాన్ఫరెన్స్ హాళ్లు, అతిధుల గదులు నిర్మించారు.
"తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నేడు దిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్‌ను ప్రారంభించనున్నాం. ఇది 1300 గజాల స్థలం. ఈ కార్యాలయం మొత్తం ఐదు అంతస్తుల్లో ఉంటుంది. మొదటి ప్లోర్లో పార్టీ ప్రెసిడెంట్ ఆఫీస్ ఉంటుంది. 42 మంది కూర్చోని మాట్లాడుకోవడానికి మంచి కాన్ఫరెన్స్ హాల్ ఉంది. రాజకీయ కార్యకలాపాలు జరపడం కోసం, వచ్చిన గెస్ట్‌లు ఉండడానికి వీలుగా బస ఏర్పాటు కోసం పార్టీ ఆఫీస్‌ను నిర్మించాం" - ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి
ఇవీ చదవండి: