ETV Bharat / bharat

బ్రిటిష్​ కాలంలోనే సరిహద్దు రగడకు ఆజ్యం!

అసోం-మిజోరం సరిహద్దులో సోమవారం జరిగిన ఘర్షణల్లో అయిదుగురు అసోం పోలీసులు మరణించడం వల్ల.. ఈ వివాదం దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశమైంది. ఒకే దేశంలోని రెండు రాష్ట్రాలు శత్రు దేశాల మాదిరిగా తలపడడం అందరినీ నివ్వెర పరుస్తోంది. అసలు సమస్య పూర్వాపరాలు ఏమిటంటే..

assam-mizoram border dispute
అసోం- మిజోరం సరిహద్దు
author img

By

Published : Jul 28, 2021, 7:11 AM IST

ఈశాన్య భారతంలో సరిహద్దు వివాదం హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణల్లో ఐదుగురు పోలీసులు మరణించారు. దీంతో ఈ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే.. ఈ రెండు రాష్ట్రాల మధ్య శత్రత్వం ఏర్పడేంతలా పరిస్థితులు దిగజారడానికి కారణమేంటి?

వివాదం ఎప్పట్నుంచి?

ఇప్పుడైతే అసోం-మిజోరం వైరం గురించి మిగతా దేశానికి తెలిసింది కానీ, వాస్తవానికి రెండు రాష్ట్రాల మధ్య బ్రిటిష్‌ కాలం నుంచే తీవ్ర సరిహద్దు వివాదం ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి ఈశాన్య భారతంలో అసోంతోపాటు మణిపుర్‌, త్రిపుర సంస్థానాలు మాత్రమే అంతర్భాగాలుగా ఉండేవి. 1963-1987 మధ్య అసోం నుంచి వివిధ భాగాలను విడదీసి నాగాలాండ్‌, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్‌, మిజోరం రాష్ట్రాలను ఏర్పాటుచేశారు. బ్రిటిష్‌ వలస పాలనలో 1875, 1933 సంవత్సరాల్లో జారీ అయిన రెండు నోటిఫికేషన్లు అసోం-మిజోరం విభేదాలకు మూల కారణమయ్యాయి. బ్రిటిష్‌ కాలంలో మిజోరంను లుషాయ్‌ పర్వత ప్రాంతంగా వ్యవహరించేవారు. 1875 నాటి నోటిఫికేషన్‌ లుషాయ్‌ పర్వతాలను, అసోంలోని కచార్‌ పర్వతాలను వేర్వేరు ప్రాంతాలుగా విభజించింది. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం తమకు 1,318 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతంపై హక్కులు ఉన్నాయని మిజోరం వాదిస్తోంది. అసోం మాత్రం ఆ వాదనను అంగీకరించడం లేదు.

రెండో నోటిఫికేషన్​లో..

ఇక బ్రిటిష్‌ కాలంలో జారీ అయిన రెండో నోటిఫికేషన్‌-1933లో లుషాయ్‌ పర్వతాలు, మణిపుర్‌ మధ్య సరిహద్దును నిర్ణయించింది. మిజోరం 1875నాటి నోటిఫికేషన్‌ను ఆమోదిస్తుంటే, అసోం 1933నాటి నోటిఫికేషనే తనకు సమ్మతమంటోంది. స్థానిక గిరిజన తెగలు భూ యాజమాన్య హక్కులను నిర్ధారించుకోవడానికి చట్టాలు, రిజిస్ట్రేషన్‌ పత్రాల మీద కాకుండా.. కొండలు, వాగులు, లోయల వంటి బండ గుర్తుల మీద ఆధారపడడం సమస్యను మరింత జటిలం చేస్తోంది. సరిహద్దులో తమకు చెందిన భూముల్లోకి అస్సామీయులు చొరబడ్డారని మిజోరం ఆరోపించింది. తమ సరిహద్దు జిల్లాలోకి మిజోలు చొచ్చుకు వచ్చారని, తమలపాకు, అరటి తోటలు వేశారని అసోం పేర్కొంది. ఈ వివాదం ఇటీవల కాల్పులకు దారితీసింది. ఈ రెండు నోటిఫికేషన్ల కారణంగా ఈ వివాదం ఇప్పటికీ అపరిష్కృతంగా ఉంది.

వలసలూ కారణమేనా?

బంగ్లాదేశ్‌, రోహింగ్యా వలసదారులు అసోం-మిజోరం సరిహద్దులోని లైలాపుర్‌కు పెద్దఎత్తున తరలివచ్చారు. అప్పటి నుంచి భూమి కోసం ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. వలసదారులు రావడానికి ముందు అసోంలోని లైలాపుర్‌ నుంచి మిజోరంలోని వైరెంగ్టే వరకు సరిహద్దులో ప్రశాంత పరిస్థితులే ఉండేవి. బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు వచ్చాక ఇళ్లు, పొలాల కోసం పెద్ద ఎత్తున అడవులను నరకడం, రెండు రాష్ట్రాల మధ్య తటస్థ ప్రాంతాలుగా ఉన్నవాటిలో నివాసం ఏర్పరచుకోవడం వంటివి ఎక్కువయ్యాయి. దీనిపై మిజోలు రగిలిపోతున్నారు.

అక్రమ రవాణాపై పట్టు కోసమేనా?

మిజోరానికి అసోంతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి 306వ నంబరు జాతీయ రహదారి మీదుగా ఆహారం, సరకులు వస్తుంటాయి. అందుకే దీన్ని మిజోరం జీవనాడిగా వర్ణిస్తున్నారు. అసోంలోని సిల్చార్‌ నుంచి మిజోరంలోని వైరెంగ్టె వరకు సాగే ఈ రహదారిని అసోం సరిహద్దు వాసులు తరచూ దిగ్బంధిస్తుంటారు. తమను వేధించడానికి, నిత్యావసర సరకులు అందకుండా చేయడానికీ అస్సామీలు ఈ రహదారిని ఆయుధంగా ఉపయోగిస్తున్నారని మిజోలు మండిపడుతున్నారు. దీనికితోడు.. స్వర్ణ త్రికోణం (మయన్మార్‌-లావోస్‌-థాయిలాండ్‌) నుంచి మాదక ద్రవ్యాలు, అక్రమ ఆయుధాలు 306వ నంబరు జాతీయ రహదారి మీదుగా ఈశాన్య భారతానికి వస్తుంటాయి. ఈ అక్రమ రవాణా ఎవరి చేతుల్లో ఉంటే వారు ఆధిపత్యం చెలాయించగలుగుతారు. అందువల్ల ఆధిపత్యం కోసం పోటీలు, పోరాటాలు ఎక్కువ అవుతున్నాయి.

రంగంలోకి హోం శాఖ

అసోం-మిజోరం సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఈ మేరకు బుధవారం దిల్లీ రావాల్సిందిగా అసోం, మిజోరం రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలను ఆదేశించింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో.. సరిహద్దులో ఉన్నట్టుండి పెరిగిపోయిన ఉద్రిక్తతలకు దారితీసిన పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చిస్తారు. అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాలను సంబంధిత రాష్ట్రాల పరస్పర సహకారంతో మాత్రమే పరిష్కరించగలమని, ఇలాంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం కేవలం సహాయకారిగా మాత్రమే వ్యవహరిస్తుందని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ మంగళవారం లోక్‌సభలో పేర్కొన్నారు. మరోవైపు, మిజోరం సరిహద్దులో చోటుచేసుకున్న ఘర్షణల్లో అయిదుగురు పోలీసులు మృతి చెందినట్లు సోమవారం అర్ధరాత్రి దాటాక అసోం ప్రకటించింది. మిజోరం పోలీసులు లైట్‌ మెషీన్‌ గన్నులు ఉపయోగించి అసోం పోలీసులపై కాల్పులు జరిపారనడానికి విస్పష్ట ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మంగళవారం ఫేస్‌బుక్‌లో ఓ సందేశం ఉంచారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.