ETV Bharat / bharat

'ఆపండీ'.. పెళ్లైన ఏడు గంటలకే పుట్టింటికి యువతి.. కారణం తెలిస్తే షాక్! - ఉత్తర్​ప్రదేశ్ ఏడు గంటల్లో పెళ్లి కూతురు ఇంటికి

వివాహం జరిగిన ఏడు గంటలకే ఓ నవ వధువు అనూహ్య నిర్ణయం తీసుకుంది. అత్తవారిల్లు దూరంగా ఉందని అక్కడికి వెళ్లేందుకు నిరాకరించింది ఓ నవవధువు. కారులో బయల్దేరి వెళ్తుండగా మధ్యలోనే ఆగి.. ఇంటికి పయనమైంది.

bride of Varanasi returned in kanpur
bride of Varanasi returned in kanpur
author img

By

Published : Mar 18, 2023, 8:49 PM IST

'ఆపండీ...'... తెలుగు సినిమాల క్లైమాక్స్​లలో వివాహాలను అడ్డుకునేందుకు చెప్పే పాపులర్ డైలాగ్ ఇది. దీనికి కాస్త ట్విస్ట్ ఇచ్చింది ఆ యువతి. వివాహం పూర్తైన తర్వాత, అత్తవారింటికి వెళ్తుండగా ఈ డైలాగ్ చెప్పింది. 'ఆపండీ' అంటూ గట్టిగా అరిచింది. పెళ్లి పూర్తైన తర్వాత ఊరేగింపుగా వెళ్తున్న వాహనాలను ఆపేయించింది. వెంటనే బోరున విలపించింది. ఏడు అడుగులు వేసిన వ్యక్తిని ఏడు గంటల్లోనే వదులుకునేందుకు సిద్ధమైంది.

ఉత్తర్​ప్రదేశ్​లో ఈ ఘటన జరిగింది. ఆ యువతికి పెళ్లి ఘనంగానే నిర్వహించారు. అప్పగింతలు అయిపోయాక వరుడితో పాటు అత్తవారింటికి బయలు దేరింది. అలా కొంత దూరం ప్రయాణించాక.. మెట్టినిల్లు చాలా దూరం ఉందని ఆమెకు అనిపించింది. ఇన్నేళ్లు పెంచిన తన పుట్టింటి వారిని వదిలి అంత దూరం వెళ్లిపోవాలా? అని మనసులో ప్రశ్నలు వేసుకుంది. దీంతో ధైర్యంగా ముందడుగు వేసేసింది. మధ్యలోనే ఇంటికి రావాలని నిశ్చయించుకొంది. అనుకున్నది సాధించింది. దీంతో, అవాక్కవడం వరుడి కుటుంబ సభ్యుల వంతైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసికి చెందిన యువతికి.. రాజస్థాన్​కు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. అనంతరం ఇద్దరికి ఘనంగా పెళ్లి చేశారు ఇరువురి కుటుంబ సభ్యులు. అప్పగింతలు అయిపోయాక మెట్టినింటికి బయలుదేరింది వధువు. అప్పటి వరకు యువతికి ఏం అభ్యంతరం లేదు. కానీ, ఇంతలో ఏమైందో ఏమో గాని వధువు ఒక్కసారిగా.. మనసు మార్చుకుంది. 'నా అత్తవారిల్లు చాలా దూరం.. నాకు రాజస్థాన్​ వెళ్లాలని లేదు.. నేను వారణాసి వెళ్లిపోతా' అంటూ ఏడవడం మొదలు పెట్టింది. కారును ఆపండంటూ.. గట్టిగా అరిచింది పెట్టింది.

దీంతో రోడ్డు పక్కన పెళ్లి కాన్వాయ్​ అంతా ఆగింది. ఓ పెట్రోల్ బంక్ దగ్గర పెళ్లి బృందం అంతా ఆగిపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆదే సమయంలో ఆ ప్రాంతంలో వధువు ఏడుస్తూ ఉండటాన్ని చూసిన పోలీస్​ రెస్పాన్స్​ వాహనంలోని సిబ్బంది.. మహరాజ్​పుర్ పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని.. వారిని వివరాలు అడిగారు. కాగా, తాము అమ్మాయికి పెళ్లి చేశామని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, తాను వారణాసి వెళ్లాలనుకుంటున్నట్లు వధువు చెబుతుండడం వల్ల.. ఆమెను సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, మహిళా పోలీసు సహాయంతో వారణాసికి పంపించారు. మరోవైపు, వరుడి తరఫు వారందరూ రాజస్థాన్‌కు చెందిన కుటుంబ సభ్యులని తెలుసుకుని.. వారిని కూడా రాజస్థాన్‌కు పంపారు పోలీసులు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.