ETV Bharat / bharat

పెళ్లికి గెస్ట్​గా గోమాత.. ఆవు ఆశీర్వాదంతో వివాహం చేసుకున్న జంట - పెళ్లిలో గోపూజ చేసిన వధూవరులు

గోమాత సమక్షంలో పెళ్లి చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది ఓ జంట. మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​లో జరిగిందీ ఆదర్శ వివాహం. ఆ పెళ్లేంటి?.. దాని కథేంటో తెలుసుకుందాం.

bride and groom performed Gopuja at the wedding  in a unique way In Gwalior
గోపూజను చేస్తున్న వధూవరులు
author img

By

Published : Jan 20, 2023, 11:53 AM IST

సమాజంలో ఒకప్పుడు గోవును చాలా పవిత్రంగా పూజించేవారు. కానీ ఇప్పుడు ఇళ్లలో గోవులు కూడా కనబడని స్థితికి చేరుకుంది. సమాజంలో గోమాత పట్ల పెరుగుతున్న నిర్లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. వారి పురాతన ఆచారాలను ప్రజలకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో గోమాత సన్నిధిలో పెళ్లిచేసుకున్నారు వధూవరులు. అనంతరం గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. గోమాత సాక్షిగా వేదమంత్రాలు, మహర్షులు, సాధువుల సమక్షంలో ఘనంగా వివాహం జరిపించారు. మధ్యప్రదేశ్​ గ్వాలియర్​లో ఈ వింత వివాహం జరిగింది.

గ్వాలియర్​లోని డీఆర్‌పీ లైన్‌లో నివసిస్తున్న రంజన శర్మకు, ఆగ్రా నివాసి యతేంద్ర శర్మకు పెద్దలు పెళ్లిని నిర్ణయించారు. గోమాత సన్నిధిలో ఈ పెళ్లి జరగాలని రంజన కుటుంబీకులు కోరగా.. వరుడు కుటుంబం సంతోషంగా దానికి ఒప్పుకుంది. దాంతో పురాతన సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు రంజన,యతేంద్ర.

bride and groom performed Gopuja at the wedding  in a unique way In Gwalior
గోపూజను చేస్తున్న వధూవరులు

సాధువుల సన్నిధిలో గోపూజ
గోమాత రక్షణపై సమాజానికి అవగాహన కల్పించేందుకు..పెళ్లిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు రంజన సోదరుడు అభిషేక్ శర్మ తెలిపారు. ముందుగా వధూవరులు.. సాధువుల సమక్షంలో గోవుకు ప్రత్యేక పూజలు చేశారు. దీంతో పాటు వేద మంత్రాల నడుమ వారి కుటుంబ ఆచారాల ప్రకారం వివాహం జరిగింది. ఈ సందర్భంగా రిషభదేవ్ ఆనంద్ మహరాజ్ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిలో గోమాతకు ప్రత్యేక స్థానం ఉందన్నారు.

గోపూజను నిర్వహిస్తున్న సాధువులు

సంప్రదాయకంగా పెళ్లి
మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి చిన్న, పెద్ద పనిలో గోమాతను పూజించేవారు. కానీ ప్రస్తుత కాలంలో మనం మన భారతీయ సంస్కృతిని వదిలి పాశ్చాత్య సంస్కృతి వైపు వెళ్తున్నారు. వివాహాలలో దుబారా ఖర్చు చేస్తున్నారు. ఎంతో గొప్పగా జరపుకునే పెళ్లిలో గొడవలు, కొట్లాటలు జరుగుతున్నాయి. సాంప్రదాయాలను మరిచి ఆధునిక హంగులకు పోయి పెళ్లికి ఉండే కలనే మార్చేస్తున్నారు. అందుకే మన ప్రాచీన సంస్కృతిని చాటిచెప్పటానికి ఈ వివాహాన్ని సాధారణంగా ఆనాటి సంప్రదాయాల ప్రకారం జరిపారు.

ఆరోగ్యకరమైన ఆహారం
మండపం ప్రధాన ద్వారం వద్ద వధూవరులు గోమాతను పూజించారు. బ్రాహ్మణులు వేద మంత్రాలు చదువుతుండగా.. గోమాత సన్నిధిలో వివాహ వేడుక జరిగింది. అతిథులను ఆప్యాయంగా ఆహ్వానించి.. అందరికీ జీవహింస లేని ఆహారాన్ని వడ్డించారు. ఇలాంటి వివాహాల ద్వారా గోసంరక్షణ, గోవు ప్రాధాన్యత గురించి ప్రజలకు తెలియజేయడానికి ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. మఠ ఆలయాల సాధువులు ఈ అపూర్వ కళ్యాణాన్ని తిలకించి అమ్మవారి సన్నిధిలో కల్యాణం జరిపించారు. గోమాత నుంచి వధూవరులు ఆశీస్సులు తీసుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.