కరోనా టీకా (covid vaccine) తీసుకున్నప్పటికీ 25శాతానికి పైగా ఆరోగ్య సిబ్బంది వైరస్ బారినపడుతున్నట్లు (breakthrough infection) ఓ అధ్యయనం వెల్లడించింది. దీనికి కారణం డెల్టా వేరియంట్ అని అంచనా వేశారు అధ్యయనకర్తలు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ (ఐజీఐబీ), మ్యాక్స్ హాస్పిటల్స్ సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని జరిపాయి.
తీవ్రత తక్కువే..
గతంలో కన్నా డెల్టా విజృంభణ తర్వాత బ్రేక్‌త్రూ ఇన్ఫెక్షన్లు ఎక్కువయ్యాయని అధ్యయనంలో తేలింది. అయితే దాని తీవ్రత చాలా స్వల్పమేనని ఐజీఐబీ శాస్త్రవేత్త శాంతను సేన్‌గుప్తా తెలిపారు. "వ్యాధి తీవ్రత తగ్గించేందుకు, మరణాలను నిరోధించేందుకు వ్యాక్సినేషన్ కీలకం. బ్రేక్‌త్రూ బారినపడిన ఎక్కువ శాతం మందిలో లక్షణాలు లేవు, కాబట్టి వైరస్‌కు అదుపు చేయడానికి మాస్కు ధరించడం తప్పనిసరి" అని సేన్‌గుప్తా అన్నారు.
కరోనాబారిన పడకుండా 2 డోసుల టీకా తీసుకున్న 95 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఈ అధ్యయనం జరిగింది. వారిలో 25.3శాతం మంది 2 నెలల లోపే వైరస్ బారిన పడినట్లు అధ్యయనం తెలిపింది.
ఇదీ చూడండి: టీకా తీసుకున్నవారికీ కరోనా- అసలు కారణం ఇదే!