రెండు డోసులు పొందిన ఆరోగ్య సంరక్షణ కార్మికులు, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ కోసం ముందుజాగ్రత్తగా.. మరో డోసు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటన విడుదల చేసింది. జనవరి 10 నుంచి మూడో డోసు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు పేర్కొంది.
రెండో డోసు పూర్తి అయిన 39 వారాల తర్వాత ఇచ్చేలా ప్రణాళిక రూపొందించినట్లు కేంద్రం వెల్లడించింది. రెండు డోసులు తీసుకున్న 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వారికి వైద్యుల సలహా మేరకే మూడో డోసు ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి : కొవిడ్ సోకిన ఏడు నెలల వరకు శరీరంలోనే వైరస్!