ETV Bharat / bharat

'బూస్టర్​ డోసుగా ఆ వ్యాక్సిన్​ ఉత్తమం' - బూస్టర్​ డోసు టీకా

Booster Dose Covishield: ఒమిక్రాన్​ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం ఇటీవల బూస్టర్​ డోసుకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కొవిషీల్డ్​ తీసుకున్న వారికి బూస్టర్​ డోసుగా కొవావాక్సే సరైనది సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

covavax
'ఆ టీకాకు కొవావాక్సే సరైన బూస్టర్​'
author img

By

Published : Dec 30, 2021, 6:30 AM IST

Booster Dose Covishield: కొవిషీల్డ్​ తీసుకున్న వారు కొవావాక్స్​ను బూస్టర్​గా తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొవిషీల్డ్​కు కొవావాక్స్​ మంచి బూస్టర్​గా పనిచేస్తున్నట్లు వైరాలజిస్ట్​ డాక్టర్​ షహీద్​ జమీల్​ పేర్కొన్నారు. ​ఇతర వ్యాక్సిన్​ కాంబినేషన్లపై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదన్నారు.

మరో ప్రముఖ వైరాలిజిస్ట్​ గగన్​దీప్ కంగ్​ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. భారత్​లో ప్రస్తుతం మూడో డోసుకు ఏ వ్యాక్సిన్​ తీసుకోవాలి అనే విషయంపై ఎలాంటి సమాచారం లేదని.. కానీ యూకేకు చెందిన ఓ సంస్థ పరిశోధనలో కొవిషీల్డ్​కు కొవావాక్స్​ మెరుగైన బూస్టర్​ అని తేలిందన్నారు.

అయితే ప్రస్తుతం దేశంలో మూడో డోసుగా ఇతర వ్యాక్సిన్​ వినియోగంపై కేంద్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇటీవల చేసిన ప్రకటన ప్రకారం.. 'ముందు జాగ్రత్త డోసు'గా అంతకుముందు రెండు డోసులు ఏవి తీసుకున్నారో అదే మూడో డోసుగా తీసుకోవాలని పేర్కొంది.

ఇదీ చూడండి : ప్రధాని న్యూ ఇయర్​ గిఫ్ట్​.. ప్రతి రైతు ఖాతాలో డబ్బులు జమ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.