ETV Bharat / bharat

నూతన ఐటీ నిబంధనల అమలుపై హైకోర్టు స్టే! - భారత్​లో భావ ప్రకటన స్వేచ్ఛ

కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ఐటీ నిబంధనల్లోని పలు క్లాజ్​ల అమలుపై బాంబే హైకోర్టు స్టే విధించింది. ఈ నిబంధనలు రాజ్యాంగంలోని అధికరణ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమని అభిప్రాయపడింది.

నూతన ఐటీ నిబంధనలపై బాంబే హైకోర్టు స్టే!
నూతన ఐటీ నిబంధనలపై బాంబే హైకోర్టు స్టే!
author img

By

Published : Aug 14, 2021, 7:05 PM IST

Updated : Aug 14, 2021, 7:42 PM IST

నూతన ఐటీ రూల్స్-2021లోని క్లాజ్​ 9(1), 9(3) నిబంధనల వల్ల భావ ప్రకటన స్వేచ్ఛకు ఆటంకం కలిగే అవకాశం ఉందని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు వీటి అమలుపై మధ్యంతర స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. డిజిటల్ మాధ్యమాలు 'కోడ్ ఆఫ్ ఎథిక్స్' (నైతిక నియమావళి)ని కచ్చితంగా అనుసరించాలని సూచించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 19కి వ్యతిరేకమేనని పేర్కొంది. ఈ అంశంపై బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జీఎస్ కులకర్ణిల ధర్మాసనం విచారణ చేపట్టింది.

విచారణలో భాగంగా.. నూతన ఐటీ నిబంధనలు 2009-ఐటీ యాక్ట్​లోని క్లాజ్ 9 పరిధిని సైతం ఉల్లఘింస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ది లీఫ్లెట్ అనే లీగల్ న్యూస్ పోర్టల్​తో పాటు.. నిఖిల్ వాగ్లే అనే జర్నలిస్ట్ నూతన ఐటీ నిబంధనలను సవాలు చేస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

ఇక ఐటీ నిబంధనల్లోని 14, 16 నియమాలపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ అంశంపై అప్పీల్ చేసేందుకు అవకాశం ఇవ్వాలన్న కేంద్రం అభ్యర్థననూ హైకోర్టు తిరస్కరించింది.

కొత్త ఐటీ నిబంధనలు..

సామాజిక మాధ్యమాలు సహా ఇతర డిజిటల్ ప్లాట్​ఫామ్స్ కొత్తగా​ చీఫ్ కంపైలెన్స్ ఆఫీసర్​, నోడల్​, రెసిడెంట్​ గ్రీవెన్స్ అధికారులను నియమించాలి. ఈ ముగ్గురు అధికారులు భారత్​ నుంచే కార్యకలాపాలు జరపాలి. అభ్యంతరకర పోస్టులపైనా వారు తీసుకున్న చర్యల గురించి ప్రతి నెలా కేంద్రానికి నివేదిక అందించాలి.

ఈ మార్గదర్శకాలను ఫిబ్రవరిలోనే విడుదల చేసింది కేంద్రం. 50లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ వినియోగదారులు ఉన్న సామాజిక మాధ్యమాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. వీటిని అమలు చేసేందుకు మే 25ను తుది గడువుగా ఉంచింది.

ఇవీ చదవండి:

Last Updated : Aug 14, 2021, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.