ETV Bharat / bharat

సోనూసూద్​ పిటిషన్​ను తిరస్కరించిన బాంబే హైకోర్టు - సోనూసూద్

బృహన్​ ముంబయి కార్పొరేషన్​ నోటీసులకు సంబంధించి సమయం కావాలన్న సోనూసూద్​ పిటిషన్​ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. అనుమతులు లేకుండానే నివాసాన్ని హోటల్​ భవనంగా మార్చారని బీఎంసీ తన నోటీసులో పేర్కొంది.

SONU-COURT
సోనూసూద్​ పిటిషన్​ను తిరస్కరించిన బాంబే హైకోర్టు
author img

By

Published : Jan 21, 2021, 12:56 PM IST

బాలీవుడ్​ నటుడు సోనూసూద్​కు బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. బృహన్​ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) నోటీసులపై 10 వారాల సమయం కావాలన్న సోనూసూద్ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. గురువారం జరిపిన విచారణ సందర్భంగా పిటిషనర్​కు చాలా సమయమే లభించిందని వ్యాఖ్యానించింది.

సోనూసూద్‌ ముంబయిలోని తన నివాస భవనం శక్తిసాగర్‌ను అవసరమైన అనుమతులు తీసుకోకుండా హోటల్‌ భవనంగా మార్చారని బీఎంసీ తన నోటీసులో పేర్కొంది. ఈ విషయంపై సోనూసూద్​ ఇప్పటికే జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే కోర్టు పిటిషన్​ను తిరస్కరించింది. తాజాగా హైకోర్టు కూడా ఇదే తీర్పును వెల్లడించింది.

ఇదీ చదవండి : టీకా తీసుకునేందుకు 80 శాతం మంది రెడీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.