ETV Bharat / bharat

'భారత్​-ఈయూ చర్చలతో వాణిజ్యం బలోపేతం' - భారత్-ఈయూ చర్చలు

సమగ్ర స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై భారత్​-యూరోపియన్​ల​ మధ్య శనివారం చర్చలు జరపనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, పోర్చుగల్​ ప్రధాని ఆంటోనియో కోస్టాతో సంభాషించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య జరుగుతున్న ఈ సదస్సు పరస్పర సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఇరుదేశాలు తెలిపాయి.

modi
భారత్​-ఈయూ చర్చలు ప్రపంచ వాణిజ్యానికే తలమానికం
author img

By

Published : May 8, 2021, 12:16 PM IST

భారత్-యూరోపియన్ యూనియన్(ఈయూ)ల మధ్య చర్చలు శనివారం జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ.. పోర్చుగల్​ ప్రధాని ఆంటోనియో కోస్టాతో మాట్లాడారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య చర్చలు పరస్పర సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. దీంతో అంతర్జాతీయంగా వాణిజ్యం, పెట్టుబడులకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. భారత్​-ఈయూ మధ్య చర్చలకు భౌగోళిక రాజకీయ ప్రముఖ్యత ఏర్పడుతుందని ఇరు దేశాధినేతలు ప్రకటించారు.

రాబోయే రోజుల్లో ప్రాంతీయంగా, ప్రపంచవ్యాప్తంగానూ భారత్​ కీలక పాత్ర పోషిస్తుందని ఇరువురు నాయకులు అన్నారు. ఈ భేటీ విలువైన భాగస్వామ్యంతో పాటు ఐరోపాకు వ్యూహాత్మక సంబంధాలను విస్తృతం చేసే దిశగా అవకాశాలను కల్పిస్తుందని వెల్లడించారు. భారత్​-ఐరోపా దేశాలు తమ సంబంధాలను మరింత విస్తరించుకునేందుకు కట్టుబడి ఉన్నాయని తెలిపారు.

ఇదీ చూడండి: భారత్-ఈయూ చర్చలు.. పాల్గొననున్న మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.