Boat Sinks Yamuna River: ఉత్తర్‌ప్రదేశ్ బాందా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. యమునా నదిలో పడవ మునిగిపోగా.. ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికితీశారు. కొందరు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 20 మందికిపైగా రక్షించినట్లు అధికారులు చెబుతున్నారు. రాత్రంతా గాలింపు చర్యలు కొనసాగిస్తామని వివరించారు. మొత్తం బోట్లో 50 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మర్కా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
మర్కా నుంచి ఫతేపుర్‌లో ఉన్న జరౌలీ ఘాట్‌కు యమునా నది మీదుగా వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. బలమైన గాలులతో సుడిగుండం ఏర్పడి.. పడవ మునిగిపోయిందని తెలుస్తోంది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. గజ ఈతగాళ్లు, ఇతర సిబ్బందితో సహాయక చర్యలు వేగవంతం చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
యమునా నదిలో పడవ మునక.. 50 మందితో వెళ్తుండగా..! - boat accident
17:10 August 11
యమునా నదిలో పడవ మునక.. 50 మందితో వెళ్తుండగా..!