బోర్డు పరీక్షలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ కీలక ప్రకటన చేశారు. 2021 జనవరి, ఫిబ్రవరిలో బోర్డు పరీక్షలు జరగవని తెలిపారు.
పరీక్షలపై ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఉపాధ్యాయులతో జరిగిన ఆన్లైన్ సమావేశంలో వెల్లడించారు. కరోనా తీవ్రత పెరగడం వల్లే పరీక్షలు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
"ప్రస్తుత పరిస్థితుల కారణంగా 10,12వ తరగతి బోర్డు పరీక్షలు 2021 ఫిబ్రవరిలో నిర్వహించడం లేదు. పరిస్ఖితులను అంచనా వేసి, మరికొంత మందిని సంప్రదించి తదుపరి షెడ్యూల్‌పై నిర్ణయం తీసుకుంటాం."
- రమేశ్ పోఖ్రియాల్, కేంద్ర విద్యాశాఖ మంత్రి
అయితే 2021లో జరగాల్సిన బోర్డు పరీక్షలను ఆన్లైన్లో కాకుండా రాతపద్ధతిలోనే నిర్వహిస్తామని ఈనెల మొదట్లో సీబీఎస్ఈ తెలిపింది. కరోనా కారణంగా ఈ ఏడాది మార్చిలో దేశవ్యాప్తంగా పాఠశాలలన్నీ మూసివేశారు. అక్టోబర్ 15 నుంచి కొన్ని పాఠశాలలు పాక్షిక్షంగా తెరిచారు.