ETV Bharat / bharat

ఆ ఊళ్లో 400మంది యూట్యూబర్స్.. రూ.లక్షల్లో సంపాదన.. కరవు ప్రాంతంలో కనక వర్షం! - బీడ్‌లో బ్లాగింగ్ ద్వారా లక్షలు సంపాదిస్తున్న యువత

కరవు ప్రాంతంలో కనక వర్షం కురిపిస్తున్నారు ఈ యువకులు. ఒకే ఊర్లో దాదాపు 300-400 మంది దాకా ఇంటర్నెట్​ ద్వారా స్వయం ఉపాధి పొందుతూ.. నెలకు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. వారే మహారాష్ట్ర బీడ్​ జిల్లాకు చెందిన యువకులు. వారి విజయ గాథ ఇదే.

blogging youth in beed
blogging youth in beed
author img

By

Published : Mar 28, 2023, 10:46 AM IST

అదో కరవు ప్రాంతం. పంటలు పండక రైతులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. పరిశ్రమలు కూడా లేకపోవడం వల్ల చాలా మంది యువకులు పని కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తారు. కానీ, ఆ ప్రాంతంలోని ఓ గ్రామం పరిస్థితి భిన్నం. ఆ ఊళ్లోని యువకులు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. సాంకేతికత అండతో స్వయం ఉపాధి పొందుతున్నారు. వారే మహారాష్ట్ర బీడ్​ జిల్లాలోని కోల్​గావ్​ గ్రామం యువకులు. వారి విజయ గాథ ఇదే.

కోల్​గావ్​ గ్రామానికి చెందిన అక్షయ్​ కుమార్​.. తాను స్వయం ఉపాధి పొంది.. నెలకు రూ.10 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. మిగతా యువకులకు కూడా దారి చూపిస్తున్నాడు. గంతలో అక్షయ్​ కూడా పనిలేక ఇబ్బంది పడ్డాడు. 2009-10 సమయంలో ఓ యూట్యూబ్​ ఛానల్​ ప్రారంభించాడు. ఆ తర్వాత బ్లాగింగ్​ మెదలుపెట్టాడు. మొదట్లో ఇంటర్నెట్​ సమస్యలతో చాలా ఇబ్బంది పడ్డాడు అక్షయ్. ఇంటర్నెట్​ సిగ్నల్​ కోసం ఊరు బయటకు వెళ్లాల్సి వచ్చేది. కానీ జియో నెట్​వర్క్​ వచ్చిన తర్వాత.. వెనుదిరిగి చూసుకోలేదు. అలా చదువుకుని ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న యువకులందరినీ ఒక్క చోటుకు చేర్చి.. యూట్యూబ్​, బ్లాగింగ్​, ఇంటర్నెట్​కు సంబంధించిన మెలకువలు నేర్పించాడు. ప్రస్తుతం ఆ గ్రామంలో 300 నుంచి 400 యువకులు యూట్యూబ్​ ఛానల్స్ ద్వారా ఉపాధి పొంది రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. కాగా, ప్రతి జిల్లాలో ఇలాంటి కార్యాలయాలు ప్రారంభించి.. యువతకు ఉపాధి కల్పించాలని అనుకుంటున్నట్లు అక్షయ్​ కుమార్​ తెలిపాడు.

blogging youth in beed
అక్షయ్​ కుమార్​
blogging youth in beed
బ్లాగింగ్​ చేస్తున్న యువకులు

'నేను ఇంతకుముందు నెట్​ పరీక్ష కోసం సన్నద్ధం అయ్యేవాడిని. కానీ లాక్​డౌన్​ తర్వాత సొంతూరికి తిరిగి వచ్చాను. అప్పుడు అక్షయ్​ కుమార్​​తో కలిసి.. పనిచేయడం మొదలుపెట్టాను. ప్రస్తుతం నాకు నెలకు రూ.1-2 లక్షల ఆదాయం వస్తోంది. ఒక ల్యాప్​టాప్​, ఐఫోన్​ కొనుక్కున్నాను. కొంత భూమి కూడా తీసుకున్నాను. ఇళ్లు కట్టిస్తున్నాను. యువకులు ఇంటర్నెట్​ డేటాను సరైన రీతిలో ఉపయోగించాలి.'
--ఆదిత్య పాటిల్, ఉపాధి పొందిన యువకుడు​

'అక్షయ్​ కుమార్​ నా క్లాస్​మేట్​. నేను అతడు చేసే పని చూశాను. ఊళ్లో చదువుకున్న యువకులంతా అతడిలా పనిచేయాలి. అప్పుడే మన ఉపాధి మనమే సృష్టించుకుని.. మంచి ఆదాయం పొందగలం.'
--సకరాం దుబాలే, స్థానికుడు

blogging youth in beed
ఆదిత్య పాటిల్, ఉపాధి పొందిన యువకుడు​
blogging youth in beed
సకరాం దుబాలే, స్థానికుడు

ఇలా వచ్చింది ఆలోచన..
ఇలా చేయాలనే ఆలోచన తనకు ఎలా వచ్చిందో వివరించాడు అక్షయ్​ కుమార్​. 'గత కొన్నేళ్లుగా చాలా మంది టిక్​టాక్​, పబ్​జీ లాంటి గేమ్స్​కు అడిక్ట్ అవుతున్నారు. దాని వల్ల వారి సమయం వృథా అవుతుందే.. కానీ, ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. దానివల్ల చాలా సైడ్​ ఎఫెక్టులు ఉంటాయి. పబ్​జీ గేమ్​ వల్ల చాలా మంది యువకులు అత్మహత్యలు కూడా చేసుకున్నారు. దానికి పరిష్కారంగానే నేను మరో మార్గం చూపించాను. అందులో భాగంగానే ఇప్పటివరకు 6 యూట్యూబ్​ ఛానళ్లు, 48 నుంచి 50 వెబ్​సైట్లు రూపొందించి.. యువతకు ఉపాధి కల్పించాను. అందులో 12 వెబ్​సైట్లు నేను​ సొంతంగా నిర్వహిస్తున్నాను. వీటిపై నెలకు దాదాపు రూ. 30 లక్షల (30-40 వేల డాలర్లు) వరకు ఆదాయం వస్తోంది. ఆ ఆదాయంలో 40 శాతం నేను తీసుకుని.. మిగతా మొత్తం యువకులకు ఇస్తాను' అని అక్షయ్​ కుమార్​ చెప్పుకొచ్చాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.