అసోం- మిజోరం సరిహ్దదులో (Assam Mizoram border dispute) మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. అంతర్రాష్ట్ర సరిహద్దు సమీపంలోని హైలకండి జిల్లాలో ఓ పోలీసు అవుట్‌పోస్ట్ వద్ద పేలుళ్లు సంభవించాయి. ఈ వ్యవహారంతో సంబంధం ఉందని భావిస్తున్న మిజోరం రాష్ట్రానికి (Assam Mizoram Clash) చెందిన ఓ పోలీసును అదుపులోకి తీసుకున్నట్లు అసోం అధికారులు తెలిపారు. గురువారం అర్ధరాత్రి 1.30 గంటలకు ఈ పేలుళ్లు జరిగినట్లు వెల్లడించారు.
స్వల్ప ప్రభావంతో రెండుసార్లు పేలుళ్లు జరిగాయని హైలకండి జిల్లా ఎస్పీ గౌరవ్ ఉపాధ్యాయ్ తెలిపారు. బైచెర్రా ఫార్వర్డ్ అవుట్‌పోస్ట్ (Assam Mizoram border) వద్ద ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. అరెస్టైన వ్యక్తి మిజోరం పోలీసు విభాగంలోని ఇండియన్ రిజర్వ్ బెటాలియన్‌కు చెందిన ఉద్యోగి అని చెప్పారు. ఈ వ్యక్తి ఘటనాస్థలిలో సంచరిస్తూ కనిపించారని, అక్కడ ఎందుకు ఉన్నారనే విషయంపై సరైన కారణం చెప్పలేదని వివరించారు. దీంతో విచారణ కోసం అతడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పేలుళ్లతో (Assam Mizoram issue) అతడికి సంబంధం ఉందని తేలిందని స్పష్టం చేశారు. నిందితుడిని శుక్రవారం.. కోర్టు ముందు హాజరుపర్చగా.. న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించిందని చెప్పారు.
హింసాత్మకంగా...
ఈ రెండు ఈశాన్య రాష్ట్రాల (Assam Mizoram news) మధ్య గత కొద్ది నెలల నుంచి పరిస్థితులు ఆందోళకరంగా ఉన్నాయి. మూడు నెలల క్రితం ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య హింసాత్మక ఘర్షణ చోటు చేసుకుంది. వివాదాస్పద సరిహద్దు అంశంపై తలెత్తిన ఈ ఘర్షణలో ఆరుగురు అసోం పోలీసులు సహా ఏడుగురు మరణించారు.
మరోవైపు, రెండు రోజుల క్రితం కైచుర్తాల్ ప్రాంతంలో వంతెన నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అసోం పోలీసులు అభ్యంతరాలు లేవనెత్తారు. ఆగస్టులో జరిగిన ఘర్షణల తర్వాత ఈ నిర్మాణం ఆగిపోయింది. ఇటీవలే.. అసోం అభ్యంతరాలు, కేంద్రం జోక్యంతో ఈ నిర్మాణాన్ని మిజోరం నిలిపివేసిందని, కానీ అక్టోబర్ 26న పనులు ప్రారంభించినట్లు గుర్తించామని ఉపాధ్యాయ్ తెలిపారు. అసోం పోలీసులు వెళ్లే సరికి పరికరాలను అక్కడే వదిలేసి అందరూ వెళ్లిపోయారని చెప్పారు.
ఇదీ చదవండి: