రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులను ఖరారు చేసేందుకు భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) శనివారం సమావేశం కానుంది. నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన నియోజకవర్గాల్లో పోటీ పడే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయనుంది.
అసోం అసెంబ్లీ ఎన్నికల కోసం ఇదివరకే ముగ్గురి పేర్లను ప్రకటించింది భాజపా. బంగాల్ కోసం 60 మంది పేర్లను ఖరారు చేసింది.
మరోవైపు, తమిళనాడు ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సైతం శనివారం భేటీ కానుంది.
నాలుగు రాష్ట్రాల్లో కలిపి 824 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా 18.68 కోట్ల మంది ఓటర్లు ఎన్నికల్లో పాల్గొననున్నారు. మార్చి 27న ప్రారంభమై, ఏప్రిల్ 29న పోలింగ్ ముగుస్తుంది. మే 2న ఫలితాలు వెల్లడవుతాయి.
ఇదీ చదవండి: 'మేరా రేషన్' మొబైల్ యాప్ ఆవిష్కరణ