కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ (భాజపా) ప్రకటించింది. మొత్తం 140 స్థానాలకు గానూ 112 మంది అభ్యర్థులను పేర్లు ప్రకటించింది. 115 స్థానాలకు పోటీ చేస్తున్నామని, మిగిలిన స్థానాలను ఇతర పార్టీలకు కేటాయించినట్లు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. ‘మెట్రోమ్యాన్’ శ్రీధరన్ పాలక్కడ్ నుంచి పోటీ చేయనున్నారని వెల్లడించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ రెండు స్థానాల నుంచి (మంజేశ్వర్, కొన్ని) పోటీ చేయనున్నారు.
తమిళనాడులో 20 స్థానాల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసింది భాజపా.
తమిళనాడులో ప్రముఖలు వీరే..
- ధరపురం- మురుగన్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
- థౌజండ్ లైట్స్- సినీ నటి ఖుష్బూ
- కోయంబత్తూర్ సౌత్- వనతి శ్రీనివాసన్, మహిళా సెల్ నాయకురాలు
- కరైకుడి-హెచ్ రాజా, సీనియర్ నాయకుడు
బంగాల్‌లో మూడో విడత కోసం 27మంది, నాలుగో విడత కోసం 36 మందితో కూడిన జాబితాలను కూడా భాజపా విడుదల చేసింది.
బంగాల్‌లో ప్రముఖులు...
- టాలీగంజ్ - బాబుల్ సుప్రియో, కేంద్రమంత్రి
- అలీపుర్దౌర్ - అశోక్ లాహిరి, ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు
- తారకేశ్వర్- స్వపన్ దాస్‌గుప్తా
- చుంచురా- లాకెట్ ఛటర్జీ
- దిన్హటా- నిషిత్ పర్మానిక్, ఎంపీ
- దోంఝూర్-రాజీబ్ బెనర్జీ, తృణమూల్ మాజీ మంత్రి
- చండీటాల- యశ్ దాస్ గుప్తా, నటుడు
- శ్యామ్పుర్- తను శ్రీ చక్రవర్తి, నటి
కేరళ నుంచి బరిలో ఉన్న ప్రముఖలు..
- పాలక్కడ్ - మెట్రోమ్యాన్ శ్రీధరన్
- మంజేశ్వర్-కె.సురేంద్రన్
- కంజిరిప్పళ్లి - కేజే అల్ఫోన్స్, కేంద్ర మాజీ మంత్రి
- నెమొమ్- కుమ్మనమ్ రాజశేఖరన్, భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు
- త్రిస్సూర్-సురేష్ గోపి, నటుడు
- ఇరింజలకుడ- జాకబ్ థామస్, మాజీ డీజీపీ