ETV Bharat / bharat

'ఫిరాయింపుదారుల వల్ల వాళ్లకు బాధలు' - తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శలు

భాజపాను నమ్ముకుని ఎప్పటి నుంచో ఉన్న వారిని కాదని... ఫిరాయింపుదారులను భాజపా పోటీకి దించుతోందని తృణమూల్​ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఫిరాయింపుదారుల వల్ల భాజపాలో చాలా కాలంగా ఉన్న నేతలు ఇప్పుడు దుఃఖిస్తున్నారని అన్నారు.

BJP old-timers shedding tears
'మా ఫిరాయింపుదారులతో వాళ్లు ఏడుస్తున్నారు'
author img

By

Published : Mar 19, 2021, 6:01 PM IST

తమ పార్టీని వీడి భాజపాలో చేరిన వారు 'నమ్మకద్రోహుల'ని బంగాల్​ ముఖ్యమంత్రి, తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శించారు. కానీ, వారి వల్ల ఇప్పుడు భాజపాలోని సీనియర్​ నేతలు బాధపడుతున్నారని అన్నారు. సొంత పార్టీని నమ్ముకున్నవారిని కాదని... ఫిరాయింపుదారులను భాజపా రంగంలోకి దించుతోందని ఎద్దేవా చేశారు.

తూర్పు మెదినీపుర్​లోని ఎగ్రాలో ఎన్నికల ప్రచారం చేశారు మమత. విద్వేషపూరిత రాజకీయాలను భాజపా ప్రోత్సహిస్తోందని విమర్శించారు. బయటి వ్యక్తుల నుంచి కాపాడుకునేందుకు తమకు సాయపడాలని ప్రజలను కోరారు.

"నమ్మకద్రోహులు ఇప్పుడు భాజపా అభ్యర్థులు అయ్యారు. ఈ ఫిరాయింపుదారులకు గతంలో ఎన్నో బాధ్యతలు ఇచ్చాం. సంక్షేమ ఫలాలన్నీ ఇప్పుడు ప్రజలకు చేరేలా నేను పర్యవేక్షిస్తున్నాను. దేవుడు పేరు చెప్పి, భాజపా వెన్నుపోటు పొడుస్తోంది. పాన్​పరాగ్​ నమిలి ప్రజల నుదటిపై తిలకం పెడుతోంది. భాజపాకు ఓటు వేయకండి."

-మమతా బెనర్జీ, తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి

భాజపాకు కాంగ్రెస్​, వామపక్షాలు మిత్రులన్న మమత.. వారికి ఓటు వేయొద్దని కోరారు. తాను ప్రచారంలో పాల్గొనకుండా భాజపా నేతలు తన కాలికి గాయం చేశారని ఆరోపించారు.

ఇదీ చూడండి:బంగాల్​ ఎన్నికల పోరులో మత పాచికలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.