ETV Bharat / bharat

సీఎం అభ్యర్థిపై నిర్ణయం వారిదే: భాజపా - సీటీ రవి తాజా వ్యాఖ్యలు

రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిని.. ఆ పార్టీ నాయకులే నిర్ణయించుకుంటారని తమిళనాడు భాజపా ఇంఛార్జ్ సీటీ రవి స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే అన్నాడీఎంకే..తమ పార్టీ సీఎం అభ్యర్థి పళనిస్వామి అని పలు మార్లు స్పష్టం చేసింది.

BJP now says AIADMK will pick its Chief Ministerial candidate
అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిపై నిర్ణయం వారిదే:భాజపా
author img

By

Published : Jan 12, 2021, 9:51 AM IST

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ అన్నాడీఎంకేపై ఆ రాష్ట్ర భాజపా ఇంఛార్జ్ సీటీ రవి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ సీఎం అభ్యర్థి ఎవరో అన్నాడీఎంకే నిర్ణయిస్తుందన్నారు. పొత్తులో అతిపెద్ద పార్టీ అన్నాడీఎంకే అని తెలిపారు.

సీఎం అభ్యర్థిని ఎన్​డీఏ అధిష్ఠానం నిర్ణయిస్తుందని తమిళనాడు భాజపా నేతలు అనుకున్నారు. కానీ కమలం పార్టీ వెనక్కి తగ్గింది.

కూటమిలో అతి పెద్ద పార్టీ అయిన అన్నాడీఎంకే నుంచే సీఎం అభ్యర్థి ఉంటారని భాజపా చెప్పుకుంటూ వచ్చింది. "కానీ అభ్యర్థి ఎవరు?.. అనేది ఎన్​డీఏ అధిష్ఠానం నిర్ణయిస్తుందని.. ముందే పళనిస్వామిని అనుకోవద్దు" అని తమిళనాడు భాజపా అధ్యక్షుడు ఎల్​. మురుగన్ ఇటీవల అన్నారు.

కానీ అన్నాడీఎంకే మాత్రం సీఎం అభ్యర్థి పళనిస్వామీ అని డిసెంబర్​ 27న జరిగిన ఎన్నికల ర్యాలీలో, జనవరి 9న నిర్వహించిన జనరల్ కౌన్సిల్​ సమావేశంలోనూ స్పష్టం చేసింది.

పొత్తు కావాలంటే స్వాగతించాల్సిందే..

పొత్తు కొనసాగాలంటే సీఎం అభ్యర్థిపై అన్నాడీఎంకే తీసుకునే నిర్ణయాన్ని కచ్చితంగా భాజపా స్వాగతించాలని ఆ పార్టీ..ఎన్నికల ప్రచారంలో తేల్చి చెప్పింది. రాష్ట్ర రాజకీయాల్లో జాతీయ పార్టీల ప్రభావం అంతగా ఉండదని అన్నాడీఎంకే సీనియర్ నేత కేపీ మునుస్వామి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : ఆమె నాకు తెలియదు: భార్యపై మాజీ సీఎం వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.