ETV Bharat / bharat

బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్​.. ఒకరు మృతి!.. పట్నాలో తీవ్ర ఉద్రిక్తత - బిహార్​ వార్తలు

Bihar BJP Protest : బిహార్‌.. పట్నాలో బీజేపీ చేపట్టిన నిరసన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను అడ్డుకునే క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. టియర్​ గ్యాస్, జలఫిరంగులు​ ప్రయోగించారు. దీంతో తీవ్రంగా గాయపడి ఓ బీజేపీ కార్యకర్త మృతి చెందినట్లు ఆ పార్టీ ఎంపీ సుశీల్‌ మోదీ ట్వీట్‌ చేశారు.

Bihar Bjp Protest
Bihar Bjp Protest
author img

By

Published : Jul 13, 2023, 4:11 PM IST

Bihar Bjp Protest : బిహార్​లోని నీతీశ్​ కుమార్​ సర్కార్​కు వ్యతిరేకంగా.. బీజేపీ చేపట్టిన ఆందోళన రాజధాని పట్నాలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. విధాన సభ మార్చ్‌ పేరుతో పట్నా గాంధీ మైదాన్‌ నుంచి రాష్ట్ర అసెంబ్లీ వరకు చేపట్టిన బీజేపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్​ చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడం వల్ల టియర్​ గ్యాస్, జలఫిరంగులు​ ప్రయోగించారు. పోలీసుల లాఠీఛార్జ్‌లో పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో బీజేపీ కార్యకర్త, జెహనాబాద్​ జిల్లా జనరల్ సెక్రటరీ విజయ్​ కుమార్ మృతి చెందినట్లు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సుశీల్‌ కుమార్ మోదీ ట్వీట్‌ చేశారు.

Bihar BJP Activist Died : "పోలీసుల లాఠీచార్జ్​ వల్ల మా పార్టీ కార్యకర్త ఒకరు చనిపోవడం చాలా దురదృష్టకరం. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులపై హత్యానేరం నమోదు చేస్తాం. దీనంతటికీ సీఎం నీతీష్‌ కుమారే కారణం" అని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్‌ మోదీ ఆరోపించారు.

  • #WATCH | Bihar | “It is so unfortunate that one of our party workers died due to a lathi charge by the police. He died on the way to the hospital. We will lodge murder charges against the police. Nitish Kumar is responsible for all this”: Sushil Modi, Former Deputy CM of Bihar &… pic.twitter.com/HVGmquoWJ4

    — ANI (@ANI) July 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అపస్మారక స్థితిలో మరో బీజేపీ కార్యకర్త!
ఛజ్జూ బాగ్​లో రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో ఓ వ్యక్తి పడి ఉన్నట్లు పట్నా పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై ఎటువంటి గాయాలు లేవని.. పట్నా మెడికల్​ కాలేజ్​లో చేర్చినట్లు చెప్పారు. అతడు కూడా బీజేపీ కార్యకర్తేనని తెలుస్తోంది.

Bihar Bjp Protest
బీజేపీ ఎంపీ జనార్ధన్​ సిగ్రివాల్​పై పోలీసుల లాఠీఛార్జ్​!

'తేజస్వీ యాదవ్​ రాజీనామా చేయాల్సిందే'
Bihar Land For Job Scam : రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు, ల్యాండ్ ఫర్‌ జాబ్‌ స్కామ్‌ కేసులో బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ పేరును సీబీఐ ఛార్జ్‌షీట్‌లో చేర్చడం వల్ల ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తోంది.

బీజేపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ అసెంబ్లీ నుంచి బయటకు లాగేసి..
Bihar Assembly BJP Mlas : రెండు రోజులుగా దీనిపై బిహార్‌ అసెంబ్లీలో అధికార, విపక్షాలు విమర్శలు చేసుకుంటున్నాయి. గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ అసెంబ్లీ నుంచి బయటకు లాగేశారు. దీంతో అసెంబ్లీ వెలుపల వారు ఆందోళనకు దిగారు.

  • #WATCH | Patna: Security personnel use water cannons and open lathi charge to disperse BJP workers protesting against Bihar govt on issue of the posting of teachers in the state pic.twitter.com/Vxp010wYDo

'అవినీతి కోటను కాపాడేందుకు ప్రజాస్వామ్యంపై దాడి'
బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్‌ ఘటనను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా ఖండించారు. "పట్నాలో బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్‌ బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. మహా కూటమి ప్రభుత్వం అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ప్రజాస్వామ్యంపై దాడి చేస్తోంది. ఛార్జిషీట్‌లో పేరు నమోదైన వ్యక్తిని రక్షించేందుకు బిహార్‌ సీఎం ప్రయత్నిస్తున్నారు" అని నడ్డా విమర్శించారు.

  • भाजपा कार्यकर्ताओं पर पटना में हुआ लाठीचार्ज राज्य सरकार की विफलता और बौखलाहट का नतीजा है। महागठबंधन की सरकार भ्रष्टाचार के क़िले को बचाने के लिए लोकतंत्र पर हमला कर रही है।जिस व्यक्ति पर चार्जशीट हुई है, उसको बचाने के लिए बिहार के मुख्यमंत्री अपनी नैतिकता तक भूल गये हैं।

    — Jagat Prakash Nadda (@JPNadda) July 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.