ETV Bharat / bharat

భాజపా నేత కారుపై కాల్పులు - BJP leader's car shot in Bengal news

బంగాల్​ రాష్ట్ర భాజపా నేత కృష్ణేందు ముఖర్జీ కారుపై కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ దాడి వెనుక టీఎంసీ నేతలు ఉన్నట్లు ఆరోపించారు కృష్ణేందు.

BJP leader's car shot at in Bengal's Asansol
భాజపా నేత కారుపై కాల్పుల కలకలం
author img

By

Published : Jan 4, 2021, 4:15 PM IST

బంగాల్​ రాష్ట్ర భాజపా కమిటీ సభ్యుడు కృష్ణేందు ముఖర్జీ కారుపై దుండగుల కాల్పులకు తెగబడ్డారు. తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ(టీఎంసీ) కార్యకర్తలే ఈ దాడి జరిపారని కృష్ణేందు ఆరోపించారు.

"కోల్​కతా నుంచి ఇంటికి వస్తుండగా.. పశ్చిమ బర్ధమాన్​ జిల్లాలోని అసన్సోల్‌లో హిరపుర వద్ద ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కారును అడ్డగించారు. కారు డోర్లు తెరిచేందుకు యత్నించి విఫలమయ్యారు. దాంతో వాహనంపై కాల్పులు జరిపారు. వారు టీఎంసీ కార్యకర్తలే" అని కృష్ణేందు అన్నారు.

స్థానికుల సాయం కోసం డ్రైవర్​ గట్టిగా హార్న్​ మోగించగా అగంతుకులు పారిపోయారని తెలిపారు. ఈ దాడి వెనుక టీఎంసీ నేతలే ఉన్నట్లు ఆరోపించిన ఆయన.. ఘటన గురించి సీనియర్​ అధికారులకు తెలియజేసినట్లు చెప్పారు.

పాత శత్రువులే దాడికి కారణం!

కృష్ణేందు ఆరోపణలను స్థానిక టీఎంసీ ఎమ్మెల్యే తపస్​ బెనర్జీ ఖండించారు. 'ఆయనపై గతంలో దోపిడీ, స్మగ్లింగ్​ సహా హత్యారోపణ కేసులున్నాయి. పాత శత్రువులే ఈ దాడి చేసి ఉంటారు' అని అన్నారు బెనర్జీ.

కృష్ణేందు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. స్థానిక సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలను పరిశీలించి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: టీకా​ కోసం ఈ వారమే భారత్​ బయోటెక్​తో ఒప్పందం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.