ETV Bharat / bharat

మరో భాజపా నేత దారుణ హత్య.. కారులో వెళ్తుంటే చుట్టుముట్టి - భాజపా నేత హత్య

బిహార్​లోని షాపుర్​ ప్రాంతంలో ఓ భాజపా నేతను దారుణంగా హత్య చేశారు దుండగులు. మృతుడు.. షాపుర్​కు చెందిన విపిన్​ కుమార్​గా గుర్తించారు పోలీసులు. అంతకుముందు కర్ణాటకలోనూ ఓ భాజపా నేత దారుణ హత్యకు గురయ్యాడు.

shoot
కాల్పులు
author img

By

Published : Jul 30, 2022, 4:28 PM IST

కర్ణాటకలో భాజపా యువనేత ప్రవీణ్​ హత్య మరువక ముందే ఆ పార్టీకి చెందిన మరో నేత దారుణ హత్యకు గురయ్యారు. విపిన్ కుమార్​ సింగ్​ అనే భాజపా నేతను దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన బిహార్​లోని మాధేపుర జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

ఇదీ జరిగింది..: షాపుర్​ పంచాయత్​లోని ఓ కోపరేటివ్​ సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్న విపిన్​ కుమార్​ (59).. శుక్రవారం సాయంత్రం కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్నారు. అప్పటికే తిక్కర్​ టోలామోర్​ ప్రాంతంలో మాటు వేసిన ఐదుగురు దుండగులు బైక్​లపై కారును వెంబడించి విపిన్​పై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనాస్థలి నుంచి పోలీసులు ఆరు బుల్లెట్​ షెల్స్​ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.

ఇటీవల కర్ణాటకలో వరుస హత్యలు కలకలం రేపాయి. దక్షిణ కన్నడ జిల్లాలో భాజపా యువనేత ప్రవీణ్​ నెట్టార్​ ఈనెల 26న హత్యకు గురయ్యారు. దుండగులు మూకుమ్మడిగా దాడి చేయగా.. ప్రవీణ్​కు తీవ్రగాయాలు అయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మరువక ముందే మరో ఘటన జరిగింది. మంగళూరు నగరంలో గురువారం సాయంత్రం స్థానిక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బాధితుడ్ని మహ్మద్​ ఫాజిల్​గా పోలీసులు గుర్తించారు. సూరత్​కల్​ ప్రాంతంలో ఓ వస్త్రదుకాణం వద్ద ఉన్న ఫాజిల్​పై నలుగురు దుండగులు దాడి చేశారు. కత్తితో పొడిచి పరారయ్యారు.

ఇదీ చూడండి : బలమైన ప్రభుత్వమంటే నియంత్రించడం కాదు: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.