ETV Bharat / bharat

యూపీలో యోగికి షాక్​.. మోదీ ఇలాకాలో భాజపా ఓటమి - Mamata Banerjee on Hanskhali rape case

UP MLC Elections: ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించింది. 27 స్థానాలకు గాను 22 స్థానాలు కైవసం చేసుకుంది. అయితే, ప్రధానమంత్రి సొంత నియోజకవర్గం వారాణాసిలో మాత్రం భాజపా ఓటమిపాలైంది. మరో వైపు బంగాల్​ ఉపఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరుగుతున్నాయి.

up election 2022 news
యూపీలో యోగికి షాక్​.. మోదీ ఇలాకాలో భాజపా ఓటమి
author img

By

Published : Apr 12, 2022, 7:12 PM IST

UP MLC Elections: ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన భాజపా.. శాసన మండలి ఎన్నికల్లోనూ దూసుకుపోయింది. 27 స్థానాలకు ఎన్నికలు జరగగా.. 22 స్థానాల్లో గెలిచింది. కాగా, ప్రధాని సొంత నియోజకవర్గం వారాణాసిలో మాత్రం భాజపా ఓటమిపాలైంది. ఈ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి అన్నపూర్ణ సింగ్ 4,234 ఓట్లతో తేడాతో ఘన విజయం సాధించారు. భాజపా తరఫున పోటీచేసిన సుధామ పటేల్ 170 ఓట్లతో మూడో స్థానంలో నిలవగా.. ఎస్పీ అభ్యర్థి 345 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. కాగా, అయోధ్య, గోరఖ్​పూర్​, ఉన్నావ్​, రాయ్​బరేలీ సహా అనేక చోట్ల భాజపా మెజార్టీ సాధించింది. ఉత్తర్​ప్రదేశ్​ శాసనమండలి ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. భాజపాను గెలిపించిన ఉత్తర్​ప్రదేశ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్రంలోని 36 శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరగగా.. తొమ్మిది స్థానాల్లో భాజపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 27 స్థానాలకు ఏప్రిల్​ 9న పోలింగ్ జరిగింది.​ 100 మంది సభ్యులు గల ఉత్తర్​ప్రదేశ్​ శాసనమండలిలో.. భాజపాకు 34, ఎస్పీకి 17, బీఎస్పీకి 4 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్​, అప్నాదళ్​ నుంచి ఒక్కో సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Bengal By Elections: బంగాల్​లో చెదురుమదురు ఘటనలు మినహా ఉపఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అసన్​సోల్​ లోక్​సభ, బల్లిగంజ్​ అసెంబ్లీ స్థానానికి మంగళవారం ఎన్నికలు జరుగాయి. సాయంత్రానికి అసన్​సోల్​లో 54.40 శాతం, బల్లిగంజ్​లో 34.60 శాతం ఓటింగ్​ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా, అసన్​సోల్ నియోజకవర్గంలో భాజపా, తృణముల్​ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. భాజపా అభ్యర్థి అగ్నిమిత్ర పాల్​ వాహనంపై తృణముల్​ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు.

అసన్​సోల్​ ఎంపీగా బాబుల్​ సుప్రియో రాజీనామా చేయడం వల్ల ఎన్నికలు జరుగుతున్నాయి. సుప్రియో భాజపాను వీడి టీఎంసీలో చేరారు. బల్లీగంజ్​లో మంత్రి సుబ్రతా ముఖర్జీ గతేడాది మరణించడం వల్ల ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి.

Mamata Banerjee on Hanskhali rape case: బంగాల్​లోని హన్స్​ఖాలీ అత్యాచార ఘటనపై మీడియా ప్రవర్తించిన తీరుపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టీఆర్​పీ కోసం మీడియా అధిక కవరేజీ చేసిందని ఆరోపించారు. బాలిక మృతికి సామూహిక అత్యాచారం కారణమా? అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. చెంపదెబ్బ కొడితే.. కిందపడి చనిపోతారా? అంటూ అశ్చర్యం వ్యక్తం చేశారు. మరణించిన ఐదు రోజుల తర్వాత ఎందుకు ఫిర్యాదు చేశారని ఆమె ప్రశ్నించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతుందని..కేసును బాలల హక్కుల కమిషన్​కు బదిలీ చేస్తామని తెలిపారు.

తమ పార్టీకి చెందిన నాయకుడు కాబట్టే నిందితుడిని రక్షించేందుకు మమతా ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిందితుడిని కాపాడేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలకు ఈ వ్యాఖ్యలే నిదర్శనమని ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి అన్నారు. ముఖ్యమంత్రి హాదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు.

ఇదీ చదవండి: సీఎం సభలో భద్రతా వైఫల్యం.. స్టేజీకి దగ్గరగా బాణసంచా పేలుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.