ETV Bharat / bharat

రాజ్యసభలో భాజపాకు 100 సీట్లు.. చరిత్రలో తొలిసారి - రాజ్యసభలో భాజపా

BJP Rajya Sabha seats in 2022: భారతీయ జనతా పార్టీ చరిత్రలోనే తొలిసారి అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. రాజ్యసభలో పార్టీ సభ్యుల సంఖ్య 100కి చేరింది. 1990 తర్వాత ఓ పార్టీ వంద సీట్ల మైలురాయిని చేరటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. గురువారం 13 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో నాలుగింటిని కైవసం చేసుకుంది భాజపా.

RAJYA SABHA
BJP in RAJYA SABHA
author img

By

Published : Apr 1, 2022, 6:48 PM IST

BJP Rajya Sabha seats in 2022: చరిత్రలో తొలిసారి రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ సభ్యుల సంఖ్య 100కి చేరింది. 1990 తర్వాత ఓ పార్టీ రాజ్యసభలో వంద సీట్ల మైలురాయిని చేరటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. ఇటీవల ఆరు రాష్ట్రాల్లో 13 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా అసోం, త్రిపుర, నాగలాండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒక్కో స్థానాన్ని భాజపా గెలుచుకుంది. పంజాబ్‌లో ఉన్న ఒక రాజ్యసభ స్థానాన్ని మాత్రం కోల్పోయింది. పంజాబ్‌లో ఐదు రాజ్యసభ స్థానాలు ఆమ్‌ఆద్మీ పార్టీకే దక్కాయి.

ప్రస్తుతం భాజపాకు రాజ్యసభలో 97 మంది సభ్యులు ఉన్నారు. పంజాబ్‌లో ఒక రాజ్యసభ స్థానాన్ని కోల్పోయినప్పటికీ ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం నాలుగు స్థానాలను కమలదళం సొంతం చేసుకోవడం వల్ల భాజపా రాజ్యసభలో 100 సీట్ల మైలురాయిని చేరుకుంది. అయినప్పటికీ.. 245 మంది సభ్యులు ఉన్న రాజ్యసభలో సాధారణ మెజార్టీకి కమలదళం ఇంకా దూరంగానే ఉంది.

2014లో భాజపా సర్కారు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన సమయంలో రాజ్యసభలో ఆ పార్టీకి 55 మంది సభ్యులు మాత్రమే ఉండేవారు. ఆ తర్వాత అనేక రాష్ట్రాల్లో భాజపా అధికారంలోకి రావడం వల్ల కమలదళం సీట్ల సంఖ్య పార్లమెంట్‌ ఎగువసభలో వందకి పెరిగింది. చివరిసారిగా 1990లో అప్పటి అధికార కాంగ్రెస్‌కు రాజ్యసభలో 108 మంది సభ్యులు ఉండేవారు. ఆ తర్వాత ప్రస్తుతం భాజపానే 100 సీట్ల మైలురాయి చేరుకుంది. అయితే.. త్వరలోనే మరో 52 స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆ సంఖ్యను కాపాడుకోవటం భాజపాకు క్లిష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​, మహారాష్ట్ర, రాజస్థాన్​, ఝార్ఖండ్​ రాష్ట్రాల్లో భాజపాకు ఎదురుదెబ్బలు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఉత్తర్​ప్రదేశ్​లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన భాజపా.. లాభపడే అవకాశం ఉంది. 11 స్థానాల్లో కనీసం 8 సీట్లు గెలుచుకునేందుకు వీలుంది.

ఇదీ చూడండి: వీడ్కోలు వేదికపై పాటలతో అలరించిన రాజ్యసభ ఎంపీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.