ETV Bharat / bharat

'కశ్మీరీల తీర్పును కమలదళం స్వీకరించాలి'

author img

By

Published : Dec 26, 2020, 8:18 PM IST

ఇటీవల జమ్ముకశ్మీర్​లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కశ్మీరీలు పీపుల్స్​ అలయన్స్​ ఫర్​ గుప్కార్​ డిక్లరేషన్​(పీఏజీడీ)కు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారని మాజీ సీఎం ఒమర్​ అబ్దుల్లా తెలిపారు. ఈ తీర్పును భాజపా కూటమి అంగీకరించాలన్నారు.

BJP, admin should accept verdict of DDC polls, stop indulging in horse-trading: Omar
'గెలిచిన వారిని కొనడం ఆపండి'

జమ్ముకశ్మీర్​లో ఇటీవల జరిగిన డీడీసీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించాలని భాజపా, దాని మిత్రపక్షాలకు సూచించారు నేషనల్​ కాన్ఫరెన్స్​ నేత ఒమర్​ అబ్దుల్లా. ఇప్పటికైనా గెలిచిన వారిని ప్రలోభ పెట్టే కార్యక్రమానికి స్వస్తి పలకాలన్నారు. ఇలాంటి చర్యలతో కాషాయ దళం ప్రజాస్వామ్యాన్ని, సంబంధిత సంస్థలను కించపరుస్తోందని విమర్శించారు.

కొత్తగా ఎన్నికైన డీడీసీ సభ్యులను ప్రలోభ పెట్టేందుకు అప్నీ పార్టీ నేత అల్తాఫ్​ బుఖారీ ప్రయత్నిస్తున్నారని ఒమర్​ ఆరోపించారు. షోపియన్ జిల్లాలో వివిధ పార్టీల నుంచి గెలిచిన నేతలను శ్రీనగర్​కు తీసుకువచ్చి వారి(అప్నీ ) పార్టీలో చేరమని బలవంతం చేస్తున్నారని అన్నారు.

"జమ్ముకశ్మీర్ ప్రజలు గుప్కార్​ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. భాజపా కూటమి ఈ తీర్పును స్వీకరించాలి. కమలనాథులు అందరూ గెలిచామని చెప్పుకుంటున్నారు. వారికి ఆ అర్హత లేదు. స్థానిక ఎన్నికల్లో గెలిచిన వారిని ప్రలోభ పెట్టాలని చూస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. పార్టీ ఫిరాయించిన వారిపై ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు చేయాలి."

-ఒమర్​ అబ్దుల్లా, జమ్ముకశ్మీర్​ మాజీ సీఎం

ఇదీ చూడండి: కశ్మీర్​లో గుప్కార్​ గుబాళింపు- జమ్మూలో భాజపా హవా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.