ETV Bharat / bharat

Bitcoin Karnataka Scam: కర్ణాటక రాజకీయాల్లో 'బిట్‌ కాయిన్​' రగడ! - కర్ణాటక బిట్​ కాయిన్​ కేసు

కర్ణాటకకు చెందిన హ్యాకర్​ శ్రీకృష్ణ అలియాస్​ శ్రీకి నుంచి ఇటీవల రూ.9 కోట్ల విలువైన బిట్​ కాయిన్లను(Karnataka Bitcoin scam) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఆ కుంభకోణం(karnataka bitcoin case) కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ వ్యవహారంతో భాజపా నేతలకు సంబంధం ఉన్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Bitcoin scam
కర్ణాటక రాజకీయాల్లో 'బిట్‌ కాయిన్​' రగడ
author img

By

Published : Nov 13, 2021, 7:15 AM IST

కర్ణాటకలో ఇటీవల బయటపడిన రూ.9 కోట్ల విలువగల బిట్‌ కాయిన్ల(Karnataka Bitcoin scam) వ్యవహారం అక్కడి రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ వ్యవహారంతో భాజపా నేతలకు సంబంధం ఉన్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా మాజీ సీఎం, జేడీఎస్‌ నేత కుమారస్వామి మరిన్ని సంచలన ఆరోపణలు చేశారు. బిట్‌ కాయిన్‌ స్కామ్‌(Karnataka Bitcoin scam) నిందితుడు జన్‌ధన్‌ ఖాతాలను హ్యాక్‌ చేసి రూ.6వేల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. ఈ విషయం ప్రధాని నరేంద్ర మోదీకి(PM Modi news) కూడా తెలిసుండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

కర్ణాటకకు(Karnataka news) చెందిన హ్యాకర్‌ శ్రీకృష్ణ అలియాస్‌ శ్రీకి నుంచి ఇటీవల రూ.9కోట్ల విలువైన బిట్‌ కాయిన్లను(karnataka bitcoin case) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంతో అధికార పార్టీకి చెందిన కొందరు కీలక నేతలకు ప్రమేయం ఉన్నట్లు కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. బొమ్మై తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారని కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే అన్నారు. ఈ ఘటనపై నిజానిజాలను భాజపా కప్పిపెడుతోందని ఆరోపించారు. హ్యాకర్‌ శ్రీకృష్ణ గతంలో ప్రభుత్వ వెబ్‌సైట్లను హ్యాకింగ్‌ చేసిన కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. క్రిప్టో కరెన్సీ ద్వారా డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్నట్లు కూడా అతడిపై ఆరోపణలున్నాయి.

మోదీతో సీఎం భేటీ

బిట్​ కాయిన్ల వ్యవహారంపై విపక్షాలు విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇటీవల కలిశారు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ధైర్యంగా, విధేయతతో పనిచేయాలని మోదీ (PM Modi news) తనకు సూచించినట్లు తెలిపారు సీఎం. 'బిట్ కాయిన్ కుంభకోణం (Karnataka Bitcoin scam) గురించి ప్రధానికి వివరించేందుకు ప్రయత్నించా. కానీ ఆందోళన చెందవద్దని ఆయన(మోదీ) నాతో అన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం నిబద్ధతతో, ధైర్యంగా పనిచేయాలని సూచించారు. మిగిలిన విషయాలు వాటంతట అవే బాగవుతాయని చెప్పారు' అని తెలిపారు.

ఇదీ చూడండి: 'బిట్​కాయిన్​తో రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతాం అనుకోకండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.