భారత సైన్యానికి విశిష్ఠ సేవలు అందించిన త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ బుధవారం తమిళనాడు కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో ఆయన సతీమణి మధులిక కూడా మృతిచెందారు. భారత సైన్యానికి ఆయన దాదాపు 43 ఏళ్ల పాటు సేవలు అందించారు. ఎన్నో సంస్కరణలు తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించారు. 1978లో సైన్యంలో చేరిన ఆయనకు.. ఎత్తైన ప్రాంతాల్లో యుద్ధం చేయడంలో దిట్టగా పేరుంది. రావత్ మృతి నేపథ్యంలో ఆయన ప్రత్యేక చిత్రమాలిక..
1958 మార్చి 16న ఉత్తరాఖండ్ పౌరీ ప్రాంతంలో రావత్ జన్మించారు. ఆర్మీలో పనిచేసి లెఫ్టినెంట్ జనరల్ స్థాయికి ఎదిగిన రావత్ తండ్రి లక్ష్మణ్‌సింగ్ దెహ్రాదూన్‌లోని కేంబ్రియన్ హాల్ స్కూల్, సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్స్ స్కూల్‌లో బిపిన్ రావత్ విద్యాభ్యాసం చేశారు. 2019 డిసెంబరు 30న భారత్‌కు తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా (సీడీఎస్) బిపిన్ రావత్ నియమితులయ్యారు. 1978 డిసెంబర్ 16న గోర్ఖా రైఫిల్స్ ఐదో బెటాలియన్‌లో చేరిన రావత్‌కు ఎత్తైన ప్రాంతాల్లో యుద్ధం చేయడంలో అపార అనుభవం ఉంది బిపిన్ రావత్ సేవలను గుర్తించిన కేంద్రం విశిష్ట్ సేవా మెడల్, పరమ్ విశిష్ట్ సేవా మెడల్, ఉత్తమ్ యుద్ధ సేవ మెడల్, అతి విశిష్ట్ సేవా మెడల్, యుద్ధ సేవా మెడల్, సేనా మెడల్‌లతో సత్కరించింది. ప్రధాని నరేంద్ర మోదీతో జనరల్ బిపిన్ రావత్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులతో బిపిన్ రావత్ దంపతులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో బిపిన్ రావత్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చివరి ఛైర్మన్‌గా రావత్ సేవలందించారు. ఇదీ చూడండి : బిపిన్ రావత్ నిజమైన దేశభక్తుడు : మోదీ