ETV Bharat / bharat

ఆడీ కారు కొన్న యూట్యూబర్.. పశువుల దొడ్డిలో పార్కింగ్​.. నెలకు లక్షల్లో ఆదాయం! - యూట్యూబ్​ స్టార్ ఆడి కారు న్యూస్​

ప్రస్తుత కాలంలో సోషల్​ మీడియా ఓ సంపద సాధనంగా మారింది. సోషల్​ మీడియా ద్వారా కొందరు చాలా డబ్బులను సంపాదిస్తున్నారు. కొందరైతే ఒక్కరోజులోనే స్టార్​లుగా మారిపోతున్నారు. అలానే బిహార్​కు చెందిన ఓ యూట్యూబర్ ఇంట్లో కూర్చొని వీడియోలు చేస్తూ వచ్చిన సంపాదనతో ఏకంగా ఎంతో విలువైన ఆడీ కారు కొన్నాడు. అవును మీరు విన్నది నిజమే.. అయితే.. అతడి కథేంటో తెలుసుకుందామా మరి..!

Harsh Rajput YouTube Video
హర్ష్​ రాజ్​పుత్​
author img

By

Published : Jan 18, 2023, 10:48 AM IST

బిహార్​కు చెందిన ఓ వ్యక్తి యూట్యూబ్​లో​ వీడియోలు చేస్తూ వచ్చిన సంపాదనతో ఆడీ కారు కొన్నాడు. కొవిడ్​ లాక్​డౌన్ నుంచి యూట్యూబ్​లో కామెడీ వీడియోలు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నాడు. అలా వచ్చిన సంపాదనతోనే దాదాపు రూ. 50 లక్షల విలువైన ఆడీ కారు కొన్నాడు ఓ యువకుడు.

డెయిరీ మిల్క్​తో మొదలైన​ ప్రయాణం..
ఔరంగాబాద్​లోని జసోయా ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల హర్ష్​ రాజ్​పుత్​ యూట్యూబ్​లో కామెడీ వీడియోలు చేస్తూ నెలకు గరిష్ఠంగా రూ.8 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. 2020 కరోనా లాక్​డౌన్ కాలంలో హర్ష్​ యూట్యూబ్​లో వీడియోలు చేయడం ప్రారంభించాడు. మొదటగా డెయిరీ మిల్క్​పై ఓ కామెడీ వీడియోను చేశాడు. అది వైరల్​గా మారినా సరే సంపాదన మాత్రం రాలేదని తెలిపాడు. ఆ తర్వాత నుంచి చేసిన అన్ని వీడియోలకు ప్రజాదరణతో పాటుగా.. సంపాదన రావడం మొదలైందని వెల్లడించాడు. ఆ వీడియోల్లో హర్ష్ రాజ్​పుత్​.. 'ధాకడ్​' అనే ఓ న్యూస్​ రిపోర్టర్​ పేరుతో.. రకరకాల సమస్యలపై కామెడీ వీడియోలు చేసి నవ్విస్తాడు.

ప్రస్తుతం అతడి ఛానల్​కు 33 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఒక్కో వీడియో దాదాపుగా 4 నుంచి 10 నిమిషాల నిడివి ఉంటుంది. ఈ కామెడీ వీడియోల ద్వారా నెలకు రూ.4 నుంచి 8 లక్షల వరకు ఆదాయం వస్తోందని హర్ష తెలిపాడు. హర్ష్​ చేసిన ఓ వీడియోకి గరిష్ఠంగా 20 మిలియన్ వ్యూస్​ వచ్చాయి. ఈ సంపాదనే కాకుండా బ్రాండ్​ ప్రమోషన్​ ద్వారా కూడా మరికొంత ఆదాయం పొందుతున్నట్లు హర్ష్ రాజ్​పుత్​ తెలిపాడు. దీంతో అతడి బ్యాంక్ బ్యాలెన్స్​ భారీగా పెరిగింది. వీడియోల ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఈ యూట్యూబ్​ స్టార్ రూ. 50 లక్షల విలువైన ఆడీ కారును కొన్నాడు.

పశువుల దొడ్డిలో ఆడీ కారు
అయితే..​ హర్ష్​ తాను కొన్న ఆడీ కారును పశువుల దొడ్డిలో ఉంచుతున్నాడు. దీని పక్కనే ఓ ఆవును కూడా కట్టి ఉంచాడు. హర్ష్​ గతంలో ఓ వీడియోలో మాట్లాడుతూ.. 'నా ఇంటి పరిస్థితి మీరు చూస్తున్నారు. మనం పుట్టినప్పుడు పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. కానీ భవిష్యత్​ మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. మీరు ఏ స్థితిలో ఉన్నా సరే కలలు కనడం మానేయకండి. కలలు నిజమవుతాయి'. అని​ అన్నాడు. ప్రస్తుతం అది వైరల్​గా మారుతుంది.

జంతుశాస్త్రంలో పీజీ పూర్తి చేసిన హర్ష్ రాజ్​పుత్​.. సివిల్స్​ కోచింగ్​ కోసం 2020లో దిల్లీకి వెళ్లాడు. అక్కడ ఓ థియేటర్​లో పనిచేయడం ప్రారంభించాడు. అదే సమయంలో కరోనా మహమ్మారి రాకతో ప్రభుత్వం లాక్​డౌన్​ విధించింది. ఆ సమయంలో ఇంటికి చేరుకున్న హర్ష్​ తన పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్​ ప్రారంభించి స్టార్​గా మారాడు. హర్ష్ రాజ్​పుత్​ తండ్రి ప్రస్తుతం హోంగార్డ్​గా విధులు నిర్వరిస్తున్నాడు. యూట్యూబ్ స్టార్​గా మారిన హర్ష్ ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.