ETV Bharat / bharat

అగ్గిపెట్టె ఇవ్వలేదని చితకబాదిన దుండగులు.. వ్యక్తి మృతి - చితకబాదిన దుండగులు

Beaten to death: మద్యం మత్తులో ఉన్న కొందరు దుండగులు అగ్గిపెట్టె ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టి చంపిన ఘటన దిల్లీలోని తైముర్​ నగర్​ ప్రాంతంలో జరిగింది. మృతుడు బిహార్​లోని పూర్ణియా జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.

Beaten to death
బాధితుడు
author img

By

Published : Mar 9, 2022, 12:12 PM IST

Beaten to death: దేశ రాజధాని దిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. అగ్గిపెట్టె ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టారు కొందరు దుండగులు. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన తైముర్​ నగర్​ ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగింది. మృతుడు బిహార్​లోని పూర్ణియా జిల్లా ధంగమా గ్రామానికి చెందిన దేవన్​ రిషిగా (35) పోలీసులు గుర్తించారు.

Beaten to death
మృతుడు దేవన్​ రిషి

ఇదీ జరిగింది..

జిల్లాలోని జసోలా గ్రామంలో తన భార్య రూపా దేవి, నలుగురు పిల్లలు అనిల్​, భీమ్​, పంకజ్​,దులారీతో కలిసి నివాసం ఉంటున్నాడు దేవన్​ రిషి. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

తైముర్​ నగర్​లో నివాసం ఉంటున్న తన సోదరుడిని కలిసేందుకు సోమవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో పయనమయ్యాడు దేవన్​. మద్యం మత్తులో ఉన్న 3-4 మంది దుండగులు ఇంద్ర క్యాంప్​ సమీపంలో దేవన్​ను అడ్డగించారు. అగ్గిపెట్టె ఇవ్వాలని డిమాండ్​ చేశారు. తన వద్ద లేదని వారితో చెప్పాడు దేవన్​. దీంతో ఆగ్రహించిన దుండగులు.. దేవన్​పై దాడికి దిగారు. అతని అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకోవటం వల్ల నిందితులు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన దేవన్​ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు దేవన్​.

మృతుడి సోదరుడు ఇచ్చిన సమాచారం మేరకు ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇటీవలే రూపేశ్​ అనే యువకుడిపై తన పిల్లల ముందే కాల్పులు జరపగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవటం ఆ ప్రాంతంలో భయబ్రాంతులకు గురి చేసింది.

ఇదీ చూడండి: పసికందు సహా ఒకే కుటుంబంలో ఐదుగురు సజీవ దహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.